యువ నటుడు రౌడీ హీరో విజయ్ దేవరకొండ హీరోగా తాజాగా యువ దర్శకుడు గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలో తెరకెక్కుతున్న లేటెస్ట్ VD 12 వర్కింగ్ టైటిల్ మూవీ పై అందరిలో మొదటి నుండి మంచి అంచనాలు ఉన్నాయి.
ఈ మూవీని సితార ఎంటర్టైన్మెంట్స్, శ్రీకర స్టూడియోస్, ఫార్చూన్ ఫోర్ సినిమాస్ సంస్థల పై నాగవంశీ, సాయి సౌజన్య గ్రాండ్ గా నిర్మిస్తున్నారు. రాక్ స్టార్ అనిరుద్ సంగీతం సమకూరుస్తున్న ఈ మాస్ యాక్షన్ ఎంటర్టైనర్ మూవీ మార్చి 28న ఆడియన్స్ ముందుకి రానుంది.
కాగా ఈ మూవీ నుండి టైటిల్ టీజర్ ని ఫిబ్రవరి 12న రిలీజ్ చేయనున్నట్లు ఇప్పటికే మేకర్స్ ఆఫీహియల్ గా అనౌన్స్ చేశారు. కాగా మ్యాటర్ ఏమిటంటే, ఈ టీజర్ ని తెలుగు, తమిళ్, హిందీ భాషల్లో ఏక కాలంలో రిలీజ్ చేయనున్నారు. కాగా తెలుగు టీజర్ కి జూనియర్ ఎన్టీఆర్ వాయిస్ ఓవర్ అందించనున్నారు.
ఇక తమిళ వర్షన్ కి సూర్య, హిందీ వర్షన్ కి రణబీర్ కపూర్ వాయిస్ ఓవర్ అందించనున్నల్టు తెలుస్తోంది. విజయ్ దేవరకొండ మాస్ పవర్ఫుల్ రోల్ లో కనిపించనున్న ఈ మూవీలో భాగ్యశ్రీ బోర్సే హీరోయిన్ గా కనిపించనున్నారు. మరి లైగర్, ది ఫ్యామిలీ స్టార్ మూవీస్ తో నిరాశ పరిచిన విజయ్ ఈ మూవీతో ఎంత మేర విజయం సొంతం చేసుకుంటారో చూడాలి.