Homeసినిమా వార్తలునీల్ మూవీ రిలీజ్ పై ఎన్టీఆర్ ఫ్యాన్స్ అసంతృప్తి

నీల్ మూవీ రిలీజ్ పై ఎన్టీఆర్ ఫ్యాన్స్ అసంతృప్తి

- Advertisement -

టాలీవుడ్ గ్లోబల్ స్టార్ యంగ్ టైగర్ ఎన్టీఆర్ హీరోగా తాజాగా రెండు సినిమాలు సెట్స్ మీద ఉన్నాయి. అందులో ఒకటి హృతిక్ రోషన్ తో కలిసి అయాన్ ముఖర్జీ దర్శకత్వంలో చేస్తున్న వార్ 2 కాగా మరొకటి ప్రశాంత్ నీల్ తీస్తున్న మాస్ యాక్షన్ పాన్ వరల్డ్ మూవీ. ఈ రెండు సినిమాల పై దేశవ్యాప్తంగా ఉన్న ఆడియన్సు లో ఎన్నో భారీ అంచనాలు ఉన్నాయి.

వీటిలో వార్ 2 ఆగష్టు 14న రిలీజ్ కానుండగా నీల్ మూవీని వచ్చే ఏడాది జూన్ 25 న రిలీజ్ చేయనున్నట్లు మేకర్స్ తాజాగా డేట్ అనౌన్స్ చేసారు. అయితే ఈ రిలీజ్ డేట్ పై ఎన్టీఆర్ ఫ్యాన్స్ అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. దానికి కారణం అదే సమయంలో పలు హాలీవుడ్ సినిమాలు రిలీజ్ అవుతుండడం.

అయితే ఇటు ఇండియాలో మాత్రం దాదాపుగా ఆ మూవీకి పెద్దగా పోటీ చిత్రాలు ఏవి రిలీజ్ అవ్వడం లేదు. వాస్తవానికి అదే రిలీజ్ డేట్ కి ఇటీవల కల్కి 2898 ఏడి మూవీ రిలీజ్ అయి బాక్సాఫీస్ వద్ద రూ. 1000 కోట్ల గ్రాస్ కొల్లగొట్టిన విషయం తెలిసిందే. మరి ఈ మూవీ రిలీజ్ అనంతరం ఎంతమేర ప్రభంజజం సృష్టిస్తుందో చూడాలి. 

READ  ​రికార్డు టైంలో రూ. 100 కోట్లు కొల్లగొట్టిన 'ఎంపురాన్'

Follow on Google News Follow on Whatsapp


- Advertisement -
RELATED ARTICLES

Trending Stories

Recent Stories