యంగ్ టైగర్ గ్లోబల్ స్టార్ ఎన్టీఆర్ హీరోగా ప్రస్తుతం కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కుతున్న మూవీ దేవర పార్ట్ 1. ఈ మూవీని యువ సుధా ఆర్ట్స్, ఎన్టీఆర్ ఆర్ట్స్ సంస్థలు గ్రాండ్ లెవెల్లో నిర్మిస్తుండగా అనిరుద్ రవిచందర్ సంగీతం అందిస్తున్నారు. ప్రస్తుతం వేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ మూవీ పై ఎన్టీఆర్ ఫ్యాన్స్ తో పాటు ఆడియన్స్ అందరిలో ఎన్నో అంచనాలు ఉన్నాయి.
ఇప్పటికే చాలావరకు షూటింగ్ జరుపుకున్న ఈమూవీ సెప్టెంబర్ 27న గ్రాండ్ గా ఆడియన్స్ ముందుకి రానున్న విషయం తెలిసిందే. ఇక ఇటీవల దేవర నుండి రిలీజ్ అయిన ఫస్ట్ సాంగ్ అయిన ఫియర్ సాంగ్ అందరినీ ఆకట్టుకుని మూవీ పై మరింతగా అంచనాలు ఏర్పరిచింది.
ఇక ఈ మూవీ నుండి సెకండ్ సాంగ్ కోసం ఎన్టీఆర్ ఫ్యాన్స్ తో పాటు ఆడియన్స్ కూడా ఎంతో ఆసక్తికరంగా ఎదురు చూస్తున్నారు. అయితే అందరూ ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న ఆ సాంగ్ త్వరలో రానుందంటూ కొద్దిసేపటి క్రితం సంగీత దర్శకుడు అనిరుద్ తన ట్విట్టర్ అకౌంట్ లో మ్యూజిక్ ఎమోజిలతో ఒక ట్వీట్ చేశారు. దానితో అతి త్వరలో ఈ సాంగ్ రిలీజ్ కానుందని అర్ధమవుతోంది. మరి రిలీజ్ అనంతరం దేవర ఏ స్థాయి అంచనాలు అందుకుంటుందో చూడాలి.