గ్లోబల్ స్టార్ యంగ్ టైగర్ ఎన్టీఆర్ హీరోగా కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కుతున్న లేటెస్ట్ భారీ పాన్ ఇండియన్ మాస్ యాక్షన్ ఎంటర్టైనర్ మూవీ దేవర పార్ట్ 1. ఈ మూవీని యువ సుధా ఆర్ట్స్, ఎన్టీఆర్ ఆర్ట్స్ సంస్థలు గ్రాండ్ లెవెల్లో నిర్మిస్తుండగా అనిరుద్ సంగీతం అందిస్తున్నారు.
బాలీవుడ్ అందాల నటి జాన్వీ కపూర్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ మూవీ నుండి ఇప్పటికే రిలీజ్ అయిన ఫస్ట్ గ్లింప్స్ తో పాటు ఫస్ట్ సాంగ్ అందరినీ ఎంతో ఆకట్టుకుని మూవీ పై బాగా అంచనాలు ఏర్పరిచాయి. బాలీవుడ్ నటుడు సైఫ్ ఆలీ ఖాన్ విలన్ గా నటిస్తున్న ఈ మూవీ సెప్టెంబర్ 27న గ్రాండ్ గా పలు భాషల ఆడియన్స్ ముందుకి రానుంది.
విషయం ఏమిటంటే, ఈ మూవీలో మరొక బాలీవుడ్ నటుడు నెగటివ్ పాత్ర చేయనున్నారట. ఇటీవల రణబీర్ కపూర్ తో సందీప్ రెడ్డి వంగా తీసిన ఆనిమల్ మూవీలో విలన్ గా నటించి అందరినీ ఆకట్టుకున్న బాబీ డియోల్ ఈ మూవీలో కూడా నటించనున్నారని, అయితే ఆయన పాత్ర యొక్క నిడివి దేవర పార్ట్ 2 లో ఎక్కువగా ఉంటుందని చెప్తున్నారు. మొత్తంగా దేవర మూవీ రోజు రోజుకు అందరిలో మరింతగా అంచనాలు పెంచేస్తుందని చెప్పాలి.