Homeసినిమా వార్తలుJr Ntr Busy with Lineups వరుస లైనప్స్ తో ఎన్టీఆర్ బిజీ బిజీ

Jr Ntr Busy with Lineups వరుస లైనప్స్ తో ఎన్టీఆర్ బిజీ బిజీ

- Advertisement -

టాలీవుడ్ స్టార్ హీరోల్లో ఒకరైన యంగ్ టైగర్ ఎన్టీఆర్ హీరోగా ప్రస్తుతం మొత్తంగా నాలుగు సినిమాలు లైన్లో ఉన్నాయి. వాటిలో ముందుగా కొరటాల శివ తీస్తున్న దేవర పార్ట్ 1 మూవీ సెప్టెంబర్ 27న ఆడియన్స్ ముందుకి రానుంది. జాన్వీ కపూర్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ మూవీలో ఎన్టీఆర్ పవర్ఫుల్ రోల్ చేస్తుండగా సైఫ్ ఆలీ ఖాన్ విలన్ గా చేస్తున్నారు.

మరోవైపు అయాన్ ముఖర్జీ దర్శకత్వంలో బాలీవుడ్ నటుడు హృతిక్ రోషన్ తో కలిసి వార్ 2 మూవీ కూడా ఆయన చేస్తున్నారు. ఈ మూవీ పై కూడా అందరిలో ఎన్నో అంచనాలు ఉన్నాయి. అలానే తాజాగా కెజిఎఫ్ సినిమాల దర్శకుడు ప్రశాంత్ నీల్ హీరోగా ఎన్టీఆర్ హీరోగా తీయనున్న మూవీ నేడు అధికారికంగా లాంచ్ అయింది.

ఈ మూవీని మైత్రి మూవీ మేకర్స్ వారు గ్రాండ్ గా నిర్మించనున్నారు. విషయం ఏమిటంటే, ఈ సినిమాల్లో దేవర ముందుగా ఈ ఏడాది సెప్టెంబర్ 27న అలానే ఆ తరువాత వార్ 2 మూవీ వచ్చే ఏడాది ఆగష్టు 14న, అనంతరం ఎన్టీఆర్ నీల్ మూవీ 2026 జనవరి 9న గ్రాండ్ గా ఆడియన్స్ ముందుకి రానున్నాయి. చివరిగా ఆపైన దేవర పార్ట్ 2 కూడా విడుదల కానున్నాయి. ఇక ఈ సినిమాలతో వరుసగా బిజీ బిజీగా గడుపునున్నారు యంగ్ టైగర్. మరి ఈ సినిమాలు ఆయనకు ఏ స్థాయి విజయాలను అందిస్తాయో చూడాలి.

READ  ​Dasara Combo Repeat 'దసరా' కాంబో రిపీట్ : కానీ ఈసారి మాత్రం ?

Follow on Google News Follow on Whatsapp


- Advertisement -
RELATED ARTICLES

Trending Stories

Recent Stories