యాంకర్ సుమకి ఉన్న క్రేజ్ గురించి వేరే చెప్పనవసరం లేదు. ఎన్నో గేమ్ షోలు, మరియు ప్రోగ్రాం ల ద్వారా ఆవిడ ప్రేక్షకులను అలరిస్తుంది. అలాగే సినిమాలకు సంభంధించిన యే ప్రి రిలీజ్ ఈవెంట్ అయినా సుమ లేకుండా జరగదు
సినిమా హీరోయిన్ గా కెరీర్ మొదలు పెట్టిన సుమ కేవలం ఒక్క సినిమాతోనే ఆ ప్రయత్నానికి శుభం పలికింది. ఆ తరువాత అడపాదడపా చిన్న పాత్రల్లో కొన్ని సినిమాల్లో కనిపించింది
ఇక టెలివిజన్ ఇండస్ట్రీ లోకి అడుగు పెట్టిన తరువాత సుమ వెనక్కి తిరిగి చూసుకోవాల్సిన పని లేకుండా పోయింది.తనదైన టైమింగ్ తో ప్రోగ్రాం లను విజయవంతం చేయడం ఆవిడకు సర్వ సాధారణం అయిపోయింది
చాలా కాలం తరువాత సుమ ప్రధాన పాత్రలో నటించిన సినిమా జయమ్మ పంచాయితీ. పూర్తిగా గ్రామీణ ప్రాంత నేపద్యంలో తీసిన ఈ సినిమా థియేటర్లలో విడుదల అయినప్పుడు ప్రేక్షకుల నుండి మిశ్రమ స్పందన లభించినా, దర్షకుడి అభిరుచికి, సుమ మరియు ఇతర నటీనటుల నటనకు మంచి ప్రశంసలే దక్కాయి.
అయితే తాజాగా జయమ్మ పంచాయితీ ఓటీటీ (అమెజాన్ ప్రైమ్) లో విడుదల అయింది. ఒక మంచి ప్రయత్నమైన ఈ చిత్రం నిజానికి నేరుగా ఓటీటీ లోనే విడుదల అయి ఉంటే బాగుండేది అని పలు వర్గాలు, ప్రేక్షకుల అభిప్రాయం. మరి వారి మాటలకు తగ్గట్టే జయమ్మ పంచాయితీ తన జెండాను ఓటీటీలో ఎగరెస్తుందా లేదా చూడాలి.