కోలీవుడ్ స్టార్ నటుడు ఇళయదళపతి విజయ్ హీరోగా ప్రస్తుతం ఆయన కెరీర్ 69వ సినిమా గ్రాండ్ గా రూపొందుతున్న విషయం తెలిసిందే. ఈ మూవీని హెచ్ వినోద్ తెరకెక్కిస్తుండగా కెవిఎన్ ప్రొడక్షన్ సంస్థ దీనిని అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తోంది.
విజయ్ కెరీర్ లో చివర మూవీ అయిన ఈ మూవీపై అందరిలో కూడా భారీ స్థాయిలో అంచనాలు ఉన్నాయి. ఇక ఈ సినిమాకి అనిరుద్ సంగీతం అందిస్తుండగా ప్రస్తుతం షూటింగ్ వేగంగా జరుపుకుంటుంది. విషయం ఏమిటంటే ఈ మూవీని ఇటీవల బాలయ్య హీరోగా అనిల్ రావిపూడి తీసిన భగవంత్ కేసరికి రీమేక్ అని కొన్నాళ్లుగా ప్రచారం జరుగుతున్న విషయం తెలిసిందే.
అయితే లేటెస్ట్ గా ఈ మూవీకి సంబంధించిన రిలీజ్ అయిన పోస్టర్స్ ను బట్టి ఇది ఆ మూవీకి రీమేక్ కాదని చాలావరకు క్లారిటీ వచ్చింది. ఇక ఈ మూవీలో పూజా హెగ్డే, మమిత బైజు ప్రధాన పాత్రలు చేస్తుండగా మరొక హీరోయిన్ అయిన శృతిహాసన్ ని కూడా ఒక కీలక పాత్ర కోసం తాజాగా టీమ్ ఎంపిక చేసింది.
దానిని బట్టి ఈ మూవీ భగవంత్ కేసరికి రీమేక్ కాదని తెలుస్తుంది. ఎందుకంటే భగవంత్ కేసరి మూవీలో ఇద్దరు ఫిమేల్ క్యారెక్టర్స్ మాత్రమే ఉన్నారు. ఒకరు కాజల్ కాగా మరొకరు శ్రీలీల అనేది తెలిసిందే. అతి త్వరలో విజయ్ 69 మూవీ టీం దీనికి సంబంధించి పూర్తి అప్డేట్స్ ఒక్కొక్కటిగా అందించనున్నాయి. ఈ ఏడాది నవంబర్ 8న జన నాయగన్ మూవీ ఆడియన్స్ ముందుకు రానుంది.