ఈరోజు ఉదయం హనుమాన్ జయంతి సందర్భంగా ఆదిపురుష్ నిర్మాతలు ఒక ప్రత్యేకమైన పోస్టర్‌ను ఆవిష్కరించారు. కాగా ఇప్పటి వరకూ ప్రేక్షకులను నిరాశపరిచిన ఆదిపురుష్ ఇతర ప్రచార కంటెంట్‌లకు భిన్నంగా ఈ పోస్టర్‌కు సానుకూల స్పందన వచ్చింది. అలాగే ఈ చిత్రంలోని మొదటి పాటను కూడా విడుదల చేశారు మరియు దీనికి జై శ్రీ రామ్ అని టైటిల్ పెట్టారు. ఈ పాట రోమాలు నిక్కబొడిచేలా ఉందని ప్రేక్షకులు అంటున్నారు.
ఈ పాటకు మనోజ్ ముంతాషిర్ సాహిత్యం అందించగా, పలువురు మగ మరియు మహిళా గాయకులు దీనిని పాడారు. అజయ్ అతుల్ స్వరకర్తలు. ఆదిపురుష్ టీజర్ చివరి దశలో తొలిసారిగా వినిపించిన ఈ పాటకు అప్పట్లోనే ప్రేక్షకుల నుంచి విశేష స్పందన లభించింది. కాగా ఈ రోజు ఒక నిమిషం నిడివి ఉన్న ఈ పాట ఆవిష్కరించబడింది మరియు ఇది నిజంగా అద్భుతంగా ఉందన్న ప్రశంసలను అందుకుంటుంది.
ఆదిపురుష్ ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ దశలో ఉంది. హిందీ, తెలుగు, తమిళం, మలయాళం, కన్నడ భాషల్లో జూన్ 16న భారీ స్థాయిలో విడుదల కానుంది. భూషణ్ కుమార్, క్రిషన్ కుమార్, ఓం రౌత్, ప్రసాద్ సుతార్ మరియు రాజేష్ నాయర్ టి-సిరీస్ ఫిల్మ్స్ మరియు రెట్రోఫిల్స్ ప్రొడక్షన్ బ్యానర్ల పై ఈ చిత్రాన్ని నిర్మించారు.
తాన్హాజీ ఫేమ్ ఓం రౌత్ ఈ పౌరాణిక నేపథ్యం ఉన్న సినిమాకి దర్శకత్వం వహించగా.. ఈ లైవ్-యాక్షన్ 3D చిత్రంలో ప్రభాస్ రాముడి పాత్రలో, కృతి సనన్ జానకిగా, సైఫ్ అలీ ఖాన్ లంకేష్‌గా, సన్నీ సింగ్ లక్ష్మణుడిగా మరియు దేవదత్తా నాగే హనుమంతుడిగా నటించారు.