యువ నటుడు తేజ సజ్జ హీరోగా యువ దర్శకుడు ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో తెరకెక్కిన లేటెస్ట్ మూవీ హను మాన్ ఇటీవల సంక్రాంతి కానుకగా ఆడియన్స్ ముందుకి వచ్చి పెద్ద సక్సెస్ సొంతం చేసుకున్న సంగతి తెల్సిందే. ఈ మూవీలో అమృత అయ్యర్ హీరోయిన్ గా నటించగా ఈ మైథలాజికల్ యాక్షన్ ఎంటర్టైనర్ మూవీని ప్రైమ్ షో ఎంటర్టైన్మెంట్ సంస్థ పై నిరంజన్ రెడ్డి నిర్మించారు.
అయితే దీనికి సీక్వెల్ గా జై హనుమాన్ మూవీ రూపొందనున్న సంగతి తెలిసిందే. దీనిని మరింత గ్రాండియర్ గా నిర్మించనున్నట్లు ఇటీవల అనౌన్స్ మెంట్ పోస్టర్ రిలీజ్ చేసిన సందర్భంగా దర్శకుడు ప్రశాంత్ వర్మ తెలిపారు. ఇక ఈ మూవీలో ముఖ్య పాత్రకు ఒక బాలీవుడ్ నటుడిని తీసుకుంటున్నట్లు అప్పట్లో వార్తలు వచ్చాయి. అలానే మెగాస్టార్ చిరంజీవి నటిస్తారని మరికొన్ని వార్తలు చక్కర్లు కొట్టాయి.
ఇక లేటెస్ట్ టాలీవుడ్ బజ్ ప్రకారం ఈ మూవీలో హీరోగా కాంతారా నటుడు రిషబ్ శెట్టి ఫిక్స్ అయినట్లు తెలుస్తోంది. ఇప్పటికే ప్రశాంత్ వర్మ రిషబ్ శెట్టిని కలిసి కథ వినిపించి అప్రూవల్ పొందారట. త్వరలోనే మూవీకి సంబంధించి పూర్తి వివరాలు అధికారికంగా వెల్లడి కానున్నాయి.