యువ నటుడు తేజ సజ్జ హీరోగా ప్రైమ్ షో ఎంటర్టైన్మెంట్స్ సంస్థ పై యువ దర్శకుడు ప్రశాంత్ వర్మ గ్రాండ్ లెవెల్లో తెరకెక్కించిన మైథలాజి యాక్షన్ ఎంటర్టైనర్ మూవీ హనుమాన్. ఈ మూవీ ఈ ఏడాది సంక్రాంతి కానుకగా ఆడియన్స్ ముందుకి వచ్చి పెద్ద సక్సెస్ సొంతం చేసుకున్న సంగతి తెలిసిందే.
దాదాపుగా బాక్సాఫీస్ వద్ద రూ. 350 కోట్లకు పైగా గ్రాస్ ని సొంతం చేసుకున్న హను మాన్ మూవీలో అమృత అయ్యర్ హీరోయిన్ గా నటించగా కీలక పాత్రల్లో వినయ్ రాయ్, వెన్నెల కిషోర్, వరలక్ష్మి శరత్ కుమార్, గెటప్ శ్రీను నటించారు .అయితే దీనికి సీక్వెల్ గా జై హానుమాన్ మూవీని తెరకెక్కించనున్నట్లు
ఇప్పటికే దర్శకుడు ప్రశాంత్ వర్మ ఒక పోస్టర్ ద్వారా అనౌన్స్ చేసారు. కాగా ఈ మూవీని మైత్రి మూవీ మేకర్స్ వారితో కలిసి ప్రశాంత్ వర్మ సినిమాటిక్ యూనివర్స్ సంస్థ గ్రాండ్ లెవెల్లో నిర్మించనుంది. కాగా మ్యాటర్ ఏమిటంటే, జైహనుమాన్ మూవీ ఫస్ట్ లుక్ ని రేపు రిలీజ్ చేయనున్నట్లు మేకర్స్ కొద్దిసేపటి క్రితం తమ సోషల్ మీడియా ప్రొఫైల్స్ ద్వారా అనౌన్స్ చేసారు. త్వరలో సెట్స్ మీదకు వెళ్లనున్న ఈ మూవీలో కాంతారా దర్శకుడు కం హీరో అయిన రిషబ్ శెట్టి కీలక పాత్ర చేయనున్నారు.