Home సినిమా వార్తలు Chalaki Chanti: గుండె నొప్పితో ICU లో చేరిన జబర్దస్త్ కమెడియన్ చలాకీ చంటి

Chalaki Chanti: గుండె నొప్పితో ICU లో చేరిన జబర్దస్త్ కమెడియన్ చలాకీ చంటి

బుల్లితెర నటుడు, జబర్దస్త్ ఫేమ్ చలాకీ చంటి ఆదివారం ఉన్నట్టుండి అస్వస్థతకు లోనయ్యారు. దీంతో ఆయనను హుటాహుటిన ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం ఆయనకు ఐసీయూ వార్డులో ఉంచి చికిత్స అందిస్తున్నట్టు సమాచారం. గుండెనొప్పితో బాధపడుతున్న చలాకీ చంటి… శనివారం హైదరాబాద్ నగరంలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చేర్పించారనే ప్రచారం జరిగింది. ప్రస్తుతం ఆయనకు ఐసీయూ వార్డులో ఉంచి చికిత్స అందిస్తున్నట్టు సమాచారం. ఆయన ఆరోగ్యం పై వైద్యులు కానీ ఆయన కుటుంబ సభ్యులు కానీ ఎలాంటి ప్రకటనా చేయలేదు.

జబర్దస్త్ షోలో కామెడీ చేసి కమెడియన్ గా తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపును ఏర్పరచుకున్నారు చంటి. తనదైన కామెడీతో ప్రేక్షకులను కడుపుబ్బ నవ్వించడంతో పాటు కామెడీ షోలకు యాంకర్ గా కూడా మంచి గుర్తింపుని ఏర్పరచుకున్నారు. ఒకప్పుడు జబర్దస్త్ లో కమెడియన్ గా చేసిన చంటి ఆ తర్వాత కొద్ది రోజులు ఆ షోను మానేసినప్పటికీ ఇటీవలే మళ్లీ రీ ఎంట్రీ ఇచ్చారు.

కేవలం బుల్లితెర పై మాత్రమే కాకుండా సినిమాల్లో కూడా చిన్న చిన్న పాత్రల్లో చంటి నటించిన విషయం తెలిసిందే. అంతే కాకుండా పలు ఈవెంట్ లకు యాంకర్ గా కూడా వ్యవహరించిన సంగతి తెలిసిందే. కాగా మొన్నటి వరకు జబర్దస్త్ అలాగే శ్రీదేవి డ్రామా కంపెనీ ప్రోగ్రాం ల ద్వారా ప్రేక్షకులను అలరించిన చంటి గత కొద్ది రోజులుగా కనిపించడం లేదు. దాంతో తనకి ఏమయింది అనే అనుమానం అందరిలోనూ మొదలయింది.

నిజానికి చంటి తీవ్ర అస్వస్థతకు గురయ్యారనే వార్త గతంలో కూడా ప్రచారంలో ఉండింది. కానీ తరువాత ఆయన ఆ వార్తలను ఖండించారు. కానీ ఈసారి ఆ వార్త నిజమని తేలింది మరియు ఇది చలాకీ చంటి అభిమానులను ఆందోళనకు గురి చేస్తోంది. ఆయన త్వరగా కోలుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుందాం.

Follow on Google News Follow on Whatsapp




Exit mobile version