Homeసినిమా వార్తలుJaathi Ratnalu Sequel Details '​జాతి రత్నాలు' సీక్వెల్ డీటెయిల్స్ 

Jaathi Ratnalu Sequel Details ‘​జాతి రత్నాలు’ సీక్వెల్ డీటెయిల్స్ 

- Advertisement -

ఇటీవల యువ దర్శకుడు అనుదీప్ కెవి దర్శకత్వంలో యువ నటులు ప్రియదర్శి, నవీన్ పోలిశెట్టి, రాహుల్ రామకృష్ణ ప్రధాన పాత్రల్లో అలానే ఫరియా అబ్దుల్లా హీరోయిన్ గా తెరకెక్కి ఆడియన్స్ ముందుకి వచ్చిన కామెడీ ఎంటర్టైనర్ మూవీ జాతి రత్నాలు. ఈ మూవీ అన్ని వర్గాల ఆడియన్స్ ని ఆకట్టుకుని బాక్సాఫీస్ వద్ద పెద్ద విజయం సొంతం చేసుకుంది. 

ఏమాత్రం పెద్దగా హంగులు ఆర్భాటాలు లేకుండా తక్కువ బడ్జెట్ తో రూపొంది భారీ కలెక్షన్ సొంతం చేసుకున్న ఈ మూవీ యొక్క సీక్వెల్ కి ప్రస్తుతం పనులు ప్రారంభం అయినట్లు తెలుస్తోంది. మరోవైపు త్వరలో విశ్వక్సేన్ తో ఫంకీ మూవీ చేసేందుకు సిద్దమవుతున్న అనుదీప్, అది పూర్తి అనంతరం ఈ ఏడాదిలోనే జాతి రత్నాలు సీక్వెల్ ని కూడా పట్టాలెక్కించేందుకు సిద్దమవుతున్నారట. 

అటు రాహుల్ రామకృష్ణ, ప్రియదర్శి, నవీన్ కూడా పలు ప్రాజక్ట్స్ తో బిజీగా ఉండడంతో ఈ లోపు వారి డేట్స్ కూడా సిద్ధం చేస్తారట. తాజాగా ఎవడే సుబ్రహ్మణ్యం మూవీ యొక్క రీ రిలీజ్ సందర్భంగా దర్శకుడు నాగ అశ్విన్ మాట్లాడుతూ, కల్కి 2 సెట్స్ మీదకు వెళ్లడం ఆలస్యం అయితే తాను కూడా జాతి రత్నాలు సీక్వెల్ పై దృష్టి పెడతానని అన్నారు. మొత్తంగా అయితే అందరినీ ఆకట్టుకున్న జాతి రత్నాలు మూవీకి సీక్వెల్ వస్తుండడంతో అది ఇనికెంతమేర కామెడీగా ఉంటుందో అని అందరిలో మంచి ఆసక్తి మొదలైంది.  

READ  Iam Proud of Vijay Deverakonda says Rashmika విజయ్ దేవరకొండ గర్వపడేలా చేసాడు : రష్మిక మందన్న 

Follow on Google News Follow on Whatsapp


- Advertisement -
RELATED ARTICLES

Trending Stories

Recent Stories