Homeసినిమా వార్తలుసీనియర్ దిగ్గజాలందరినీ కోల్పోయిన తెలుగు చిత్ర పరిశ్రమ

సీనియర్ దిగ్గజాలందరినీ కోల్పోయిన తెలుగు చిత్ర పరిశ్రమ

- Advertisement -

తెలుగు సినిమా తన స్వర్ణయుగపు దశలో భాగమైన సూపర్‌స్టార్‌ లందరినీ కోల్పోయింది. టాలీవుడ్‌ని ఏలిన ఐదుగురు సూపర్‌స్టార్‌లు ఇప్పుడు మన మధ్య లేరు. ఎన్టీఆర్, ఏఎన్ఆర్, కృష్ణ, శోబన్ బాబు మరియు కృష్ణం రాజు వారి కాలంలోని అతిపెద్ద సూపర్ స్టార్లుగా ఉన్నారు.

వారిలో ప్రతి ఒక్కరికి వారి స్వంత వ్యక్తిత్వం మరియు తమదైన శైలి ఏర్పరచుకుని అగ్ర హీరోలుగా రాణించారు. అయితే వారి ప్రభావం కేవలం నటనకు మాత్రమే పరిమితం కాలేదు. అంతకు మించి వారు రాజకీయాలు, దాతృత్వం మొదలైన వాటిలో కూడా విజయం సాధించారు.

ఎన్టీఆర్ అందరికంటే పెద్దవారు అయితే ఏఎన్ఆర్ మాత్రం సినీ పరిశ్రమలో సీనియర్ అనే విషయం తెలిసిందే. బ్లాక్ అండ్ వైట్ యుగంలో వీరిద్దరూ సూపర్ స్టార్‌డమ్‌ను ఆస్వాదించారు. కృష్ణ ఎన్టీఆర్ అంటే చాలా అభిమానంతో ఆయన్ను కలుసుకుని పాత్ర కోసం అడిగారు.

అయితే ముందుగా గ్రాడ్యుయేషన్ పూర్తి చేయాలని కృష్ణకు ఎన్టీఆర్ సూచించారు. కృష్ణ తర్వాత కొన్ని సినిమాలు చేసారు, ఆయా సినిమాల్లో ఫైట్స్‌లో ఆయన డేరింగ్ యాటిట్యూడ్ నిర్మాత దూండిని ఆకట్టుకుంది. ఆ తరువాత కృష్ణ గారికి గూడాచారి 116 సినిమా అందించబడింది. అది ఆయన కెరీర్‌నే మార్చేసింది. సూపర్ స్టార్ గా ఎదిగిన కృష్ణకు వెనుదిరిగి చూసే పరిస్థితి రాలేదు. దురదృష్టవశాత్తు ఆయన 80వ ఏట సినీ పరిశ్రమ ఆయనను కోల్పోయింది.

కృష్ణ మృతి టాలీవుడ్‌లో విషాదాన్ని నింపింది. ఆయన మరణంతో 70ల నాటి తెలుగు చిత్ర పరిశ్రమలోని చివరి లెజెండ్‌ను కోల్పోయింది. ఈ సంవత్సరం ఇంకో లెజెండరీ నటుడిని కూడా మరణించడం పరిశ్రమ చూసింది. పవర్ ఫుల్ పాత్రలతో గుర్తింపు తెచ్చుకున్న రెబల్ స్టార్ కృష్ణంరాజు ఇటీవల కన్నుమూశారు.

READ  నిరాశ పరచిన సర్కారు వారి పాట టీఆర్పీ రేటింగ్స్

శోభన్ బాబు తప్ప, ఈ సూపర్ స్టార్లందరూ తమ నటన వారసత్వాన్ని కొనసాగించడానికి చిత్ర పరిశ్రమలో తమ వారసులను స్థాపించారు. మహేష్ బాబు తన తండ్రి కీర్తిని సమర్ధవంతంగా మోసుకొస్తూ ఉన్నారు.

అయితే లెజెండ్స్ అంతా ఇండస్ట్రీని వదిలి వెళ్లడం టాలీవుడ్‌కి చాలా కష్టమైన సమయంగా మారింది. ఎప్పుడు గొడవలు వచ్చినా ఇండస్ట్రీకి అండగా ఉండే పెద్ద దిక్కులా వారంతా ప్రవర్తించేవారు. అంతే కాక అవసరం వచ్చినపుడు వివిధ ప్రభుత్వాలతో పరిశ్రమ సంక్షేమం కోసం అభ్యర్థనలు కూడా చేశారు.

నిజానికి చెప్పడానికి బాధగా ఉంది కానీ.. టాలీవుడ్ ఇప్పుడు నిజంగా కుటుంబ పెద్ద లేని ఒక కుటుంబంగా మారింది.

Follow on Google News Follow on Whatsapp

READ  బిల్లా స్పెషల్ షోలలో అపశృతి.. అత్యుత్సాహంతో థియేటర్ తగలబెట్టిన ప్రభాస్ ఫ్యాన్స్


- Advertisement -
RELATED ARTICLES

Trending Stories

Recent Stories