Homeసినిమా వార్తలుNTR: వార్ 2తో ఎన్టీఆర్ చాలా పెద్ద రిస్క్ చేస్తున్నారా?

NTR: వార్ 2తో ఎన్టీఆర్ చాలా పెద్ద రిస్క్ చేస్తున్నారా?

- Advertisement -

కొన్ని రోజులుగా ఎన్టీఆర్ యష్ రాజ్ ఫిల్మ్స్ స్పై యూనివర్స్‌లో చేరనున్నారనే వార్త తెలుగు చిత్ర పరిశ్రమలో చర్చనీయాంశమైంది. ఎన్టీఆర్ హృతిక్ రోషన్‌తో స్క్రీన్ స్పేస్‌ను పంచుకోవడాన్ని చూడాలని ఆయన అభిమానులు మరియు ఇతర ప్రేక్షకులు చాలా మంది ఉత్సాహంగా ఉన్నారు. RRR వంటి భారీ విజయం తర్వాత ఒక పెద్ద బాలీవుడ్ చిత్రంలో భాగం కావడం నిజంగా ఎన్టీఆర్ తన మార్కెట్‌ని పెద్ద స్థాయికి తీసుకెళ్లడంలో సహాయపడుతుంది.

అయితే వార్‌ 2లో ఎన్టీఆర్‌ నటించడం పెద్ద రిస్క్‌గా రుజువయ్యే అవకాశం ఉందనే మరో వాదన వినిపిస్తోంది. ఎందుకంటే బాహుబలి లేదా KGF సిరీస్ వంటి వాటితో పోలిస్తే YRF స్పైవర్స్ అంత ప్రజాదరణ పొందలేదు. కేజీఎఫ్‌, బాహుబలి రెండో పార్ట్‌లు దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించాయి.

ఇప్పుడు మనం YRF స్పై యూనివర్స్‌ గురించి అదే చెప్పలేము ఎందుకంటే ఈ సీరీస్ లో నుండి వచ్చిన చిత్రాలు కేవలం హిందీలో మాత్రమే ప్రాచుర్యం పొందాయి మరియు ఈ సిరీస్‌లోని ఏ సినిమా ఇతర భాషా మార్కెట్‌లలో పెద్దగా క్లిక్ కాలేదు. తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం నుండి కొంత మంది ప్రేక్షకులు మాత్రమే ఈ యూనివర్స్‌ నుండి సినిమాలను వీక్షించారు.

READ  Shankar: భారతీయుడు 2 - ఆర్ సి 15 రిలీజ్ ల పై శంకర్ ప్లాన్స్

ఇక ఈ యూనివర్స్ లో ఎన్టీఆర్ తోడైతే వారికి చాలా ప్లస్ అవుతుందనడంలో సందేహం లేదు.. ఆ రకంగా వారు దక్షిణాది మార్కెట్ల నుంచి భారీ వసూళ్లు రాబట్టవచ్చు కానీ ఈ సినిమా ఎన్టీఆర్ కు ఎంత వరకు లాభిస్తుంది అనేది ప్రశ్న. వార్ 2 సినిమాని ఒకే చేయడం ద్వారా ఎన్టీఆర్ బాలీవుడ్‌లో మార్కెట్ ను పెంచుకునే అవకాశం ఎంతైనా ఉంది. అయితే ఈ చిత్రం దక్షిణాది భాషలలో ఎలా ఆడుతుందో వేచి చూడాలి.

ముఖ్యంగా తెలుగు మార్కెట్‌లో ఎన్టీఆర్ ఇతర సినిమాల తరహాలో వార్ 2 కూడా ప్రదర్శింపబడడం అంత సులువు కాదనే చెప్పాలి. మరి ఎన్టీఆర్ చేసిన ఈ ఎత్తుగడ రిస్క్ ఆ కాదా అనేది కాలమే చెప్పాలి.

Follow on Google News Follow on Whatsapp

READ  NTR30: ఎట్టకేలకు లాక్ అయిన ఎన్టీఆర్ 30 షూటింగ్ లాంచ్ డేట్


- Advertisement -
RELATED ARTICLES

Trending Stories

Recent Stories