టాలీవుడ్ యువ నటుడు నాచురల్ స్టార్ నాని ఇటీవల యువ దర్శకుడు వివేక్ ఆత్రేయతో చేసిన మూవీ సరిపోదా శనివారం. ఎస్ జె సూర్య విలన్ గా కనిపించిన ఈ మూవీలో ప్రియాంక మోహన్ హీరోయిన్ గా నటించారు. మంచి అంచనాలతో రిలీజ్ అయిన ఈమూవీ బాక్సాఫీస్ వద్ద విజయవంతం అయింది. ఇక దీని అనంతరం తాజాగా శ్రీకాంత్ ఓదెల తో ఒక మూవీ చేసేందుకు సిద్ధమయ్యారు నాని.
గతంలో శ్రీకాంత్ తో నాని చేసిన మూవీ దసరా. కీర్తి సురేష్ హీరోయిన్ గా నటించిన ఈ మూవీ బాగా సక్సెస్ అయి నటుడిగా నానికి మరింత మంచి పేరు తీసుకువచ్చింది. ఇక దీని అనంతరం తామిద్దరం చేయబోయే మూవీ పై ఆడియన్స్ లో మరింత క్రేజ్ ఉంటుందని ఆశించిన వీరు ఈసారి ఒక డిఫరెంట్ మూవీతో ఆడియన్స్ ముందుకి వచ్చేందుకు సిద్దమై ఇటీవల దానిని అనౌన్స్ చేసారు.
విషయం ఏమిటంటే, వీరిద్దరి రెండవ కాంబో మూవీకి పారడైస్ అనే టైటిల్ ని ఫిక్స్ చేసారని, ఇప్పటికే అఫీషియల్ అనౌన్స్ వచ్చిన ఈ మూవీ త్వరలో షూట్ ప్రారంభం జరుపుకోనుందని అంటున్నారు. అన్ని వర్గాల తో పాటు నాని ఫ్యాన్స్ ని కూడా అలరించేలా దర్శకుడు శ్రీకాంత్ ఈ స్క్రిప్ట్ ని సిద్ధం చేసినట్లు చెప్తున్నారు.