Homeసినిమా వార్తలుపూరి - విజయ్ సేతుపతి మూవీకి ఇంట్రెస్టింగ్ టైటిల్ 

పూరి – విజయ్ సేతుపతి మూవీకి ఇంట్రెస్టింగ్ టైటిల్ 

- Advertisement -

పూరి జగన్నాథ్ ప్రస్తుతం కెరీర్ పరంగా కొంత ఒడిదోడుకులని ఎదుర్కొంటున్నారు. ఇటీవల రౌడీ హీరో విజయ్ దేవరకొండతో తీసిన లైగర్ తో పాటు ఉస్తాద్ రామ్ పోతినేని హీరోగా తెరకెక్కిన డబుల్ ఇస్మార్ట్ సినిమాలతో ఘోరమైన డిజాస్టర్స్ చవిచూశారు .

వాటి ఘోర పరాజయాల అనంతరం ఒకింత ఆలోచనలో పడ్డ పూరి, ప్రస్తుతం కోలీవుడ్ నటుడు విజయ్ సేతుపతి తో ఒక యాక్షన్ మూవీ చేసేందుకు సిద్ధమవుతున్నారు. ఇప్పటికే విజయ్ ని కలిసి కథ, కథనాలు వినిపించిన పూరి, దానికి ఇంట్రెస్టింగ్ టైటిల్ ని కూడా ఫిక్స్ చేశారనేది లేటెస్ట్ టాలీవుడ్ టాక్. ఒక ప్రముఖ అగ్ర నిర్మాణ సంస్థ ఈ క్రేజీ కాంబినేషన్ మూవీని గ్రాండ్ లెవెల్లో నిర్మించానుందట

కాగా అందుతున్న సమాచారం ప్రకారం ఈ మూవీకి బెగ్గర్ అనే టైటిల్ ని ఫిక్స్ చేశారట. ఇటీవల తమిళ్ లో బ్లడీ బెగ్గర్ మూవీ టైటిల్ తో నటుడు కవిన్ ఒక మూవీ చేసారు .మరి బెగ్గర్ టైటిల్ తో పూరి ఎటువంటి మూవీ చేస్తారో, విజయ్ సేతుపతి పాత్ర ఏవిధంగా ఉంటుందో, ఓవరాల్ గా మూవీ ఎప్పుడు అనౌన్స్ అయి ప్రారంభం అవుతుందో అనే విషయాలు అన్ని కూడా త్వరలో అధికారికంగా వెల్లడి కానున్నాయి. 

READ  AR Rahman falls Seriously Ill తీవ్ర అస్వస్థతకు గురైన ఏ ఆర్ రహమాన్ 

Follow on Google News Follow on Whatsapp


- Advertisement -
RELATED ARTICLES

Trending Stories

Recent Stories