Homeసినిమా వార్తలువిక్రాంత్ రోణ అద్భుతం అన్న రాజమౌళి

విక్రాంత్ రోణ అద్భుతం అన్న రాజమౌళి

- Advertisement -

తెలుగు సినీ పరిశ్రమలో దిగ్గజ దర్శకుడిగా ఎస్ ఎస్ రాజమౌళికి ఎంత పేరుందో.. ఒక సినీ ప్రేమికుడిగా కూడా అంతే మంచి పేరుంది. సాధారణంగా ఆయన ఏదైనా సినిమా చూసి అది నచ్చితే, వెంటనే సోషల్ మీడియాలో దానిపై తన స్పందనను తెలియజేస్తుంటారు ఎస్ ఎస్ రాజమౌళి. అంత పెద్ద దర్శకుడే సినిమా బాగుంది అన్నారంటే సినిమాలో ఖచ్చితంగా ఉండే ఇంటుంది అని ప్రేక్షకులు అనుకోవడం ఖాయం. ఆయన అలా చెప్పడం వల్ల ఆయా సినిమాలకు కూడా కాస్త క్రేజ్ ఏర్పడుతుంది.

ఇప్పుడు ‘విక్రాంత్ రోణ’ విషయంలోనూ అదే జరిగింది. జులై 28న విడుదలైన ఈ ప్యాన్ ఇండియా సినిమాని ఇటీవలే రాజమౌళి వీక్షించారట. ఈ సందర్భంగా రాజమౌళి, విక్రాంత్ రోణ చిత్ర బృందానికి శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సినిమా తనకెంతో నచ్చిందని.. ఇలాంటి చిత్రం పై పెట్టుబడి పెట్టాలంటే అందుకు దమ్ము, ధైర్యం ఉండాలని.. ఆ ధైర్యం చేసినందుకు మీకు తగిన ఫలితం దక్కిందంటూ ట్విటర్ లో సుదీప్ మరియు విక్రాంత్ రోణ చిత్ర యూనిట్ ను రాజమౌళి అభినందించారు.

ఈ మేరకు రాజమౌళి చేసిన ట్వీట్ సారాంశం ఏంటంటే.. విక్రాంత్ రోణ విజయం సాధించినందుకు సుదీప్‌కు, చిత్ర బృందానికి శుభాకాంక్షలు. ఇలాంటి సినిమా చేయాలంటే.. దమ్ము, ధైర్మ, ఆత్మవిశ్వాసం ఉండాలి. మీరు (సుదీప్‌ని ఉద్దేశిస్తూ) ధైర్యంగా ముందడుగు వేసినందుకు, మంచి ఫలితం దక్కింది. ఈ చిత్రానికి ఆయువుపట్టు అయిన ప్రీ-క్లైమాక్స్ ఎపిసోడ్ నిజంగా అద్భుతంగా ఉంది. అసలు అది ఆ స్థాయిలో తెరకెక్కిస్తారని అసలు ఊహించనే లేదు. ఆ సన్నివేశం చాలా బాగుంది. సినిమా అంతా నాకు బాగా నచ్చింది అంటూ ఇక్కడ గుడ్డి స్నేహితుడు భాస్కర్‌ను ప్రత్యేకంగా మెన్షన్ చేయాల్సిందే అంటూ ట్వీట్ చేశారు రాజమౌళి.
అందుకు ఎంతో ఆనందంగా హీరో కిచ్ఛా సుదీప్ బదులిచ్చారు.. ధన్యవాదాలు సార్. మీ నుంచి ఇలాంటి ప్రశంసలు అందడం మాకు మా చిత్ర యూనిట్ కు ఎంతో గర్వంగా ఉంది. భాస్కర్ తరపున, మా చిత్ర బృందం తరఫున మీకు బిగ్ హగ్ అంటూ సుదీప్ తన సంతోషాన్ని చెప్పుకొచ్చారు.

READ  OTT - ది గ్రే మ్యాన్ రివ్యూ

కాగా.. అనూప్ భండారి దర్శకత్వంలో రూపొందిన ‘విక్రాంత్ రోణ’లో సుదీప్ సరసన శ్రీలంకన్ బ్యూటీ జాక్వెలిన్ ఫెర్నాండెజ్ కీలకమైన పాత్రలో నటించింది. ఆమె నాట్యం చేసిన “రా రా రక్కమ్మా” పాట ఈ మధ్య ప్రతి చోటా వినిపిస్తుంది అంటే అది అతిశయోక్తి కాదు. నిరూప్ భండారి, నీత అశోక్, మధుసుధన్ రావు కీలక పాత్రల్లో నటించిన ఈ ప్యాన్ ఇండియా చిత్రానికి దాదాపు అన్ని వర్గాల నుంచి మంచి స్పందన వస్తోంది. ఈ నేపథ్యంలోనే ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద మంచి వసూళ్లు కూడా రాబడుతోంది. ఇక రాజమౌళి వంటి బిగ్ డైరక్టర్ ట్వీట్ ద్వారా ఆ చిత్రం యొక్క మంచి టాక్ మరింత పెరుగుతుంది.

Follow on Google News Follow on Whatsapp

READ  విక్రాంత్ రోణ ఫస్ట్ డే ఫస్ట్ షో టాక్


- Advertisement -
RELATED ARTICLES

Trending Stories

Recent Stories