కమల్ హాసన్ హీరోగా దిగ్గజ దర్శకుడు శంకర్ దర్శకత్వంలో ఇటీవల తెరకెక్కిన ఇండియన్ 2 మూవీ ఆడియన్స్ ముందుకు వచ్చి భారీ డిజాస్టర్ గా నిలిచిన విషయం తెలిసిందే. కాగా ఈ మూవీకి సీక్వెల్ అయిన ఇండియన్ 3 పై శంకర్ గట్టిగా దృష్టి పెట్టినట్టు తెలుస్తోంది. ఇందులో కాజల్ అగర్వాల్ కూడా కీలకపాత్రలో కనిపించనున్నారు.
ఇప్పటికే కొంతమేర షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమాని వాస్తవానికి ఈపాటికి పూర్తి చేయాల్సి ఉండగా మధ్యలో రాంచరణ్ తో గేమ్ చేజర్ మూవీ ఉండటంతో శంకర్ కొన్నాళ్ళు పక్కన పెట్టారు.
ఇక తాజా అప్ డేట్ ప్రకారం త్వరలో సెట్స్ మీదకు వెళ్ళనున్న ఈ సినిమాని వీలైనంత త్వరగా పూర్తి చేసి ఈ ఏడాది డిసెంబర్లో ప్రేక్షకుల ముందుకు తీసుకువచ్చేందుకు ప్లాన్ చేస్తుందట శంకర్ అండ్ టీం.
అలానే అందుతున్న సమాచారం ప్రకారం ఎక్కడా కాంప్రమైజ్ కాకుండా ఇండియన్ 3 ని ఆకట్టుకునే యాక్షన్ ఎంటర్టైనర్ గా దర్శకుడు శంకర్ తీయనున్నారని, ఖచ్చితంగా ఇది అంచనాలు అందుకుంటుందని టీం అయితే ఆశాభావం వ్యక్తం చేస్తుంది. త్వరలో పట్టాలెక్కనున్న ఈ మూవీ గురించిన అన్ని వివరాలు ఒక్కొక్కటిగా అప్ డేట్స్ రానున్నాయి.