Homeసినిమా వార్తలుIndian 2: భారతీయుడు సీక్వెల్ లోనూ ద్విపాత్రాభినయం చేయనున్న కమల్ హాసన్

Indian 2: భారతీయుడు సీక్వెల్ లోనూ ద్విపాత్రాభినయం చేయనున్న కమల్ హాసన్

- Advertisement -

కమల్ హాసన్, శంకర్ కాంబినేషన్ లో తెరకెక్కాల్సిన భారతీయుడు 2 సినిమా సెట్ లో ఘోర ప్రమాదం జరిగి ముగ్గురు మృతి చెందిన కారణంగా ఆ సినిమా షూటింగ్ అర్ధాంతరంగా ఆగిపోయింది. ఆ తరువాత, కరోనా మహమ్మారి కారణంగా సినిమా పురోగతి నిలిచిపోయింది. అయినప్పటికీ ఈ సినిమా తీయాలనే తమ నిర్ణయాన్ని చిత్ర నిర్మాతలు కొనసాగిస్తూ వచ్చారు.

ఇక ఈ చిత్రానికి సంబంధించిన ఇతర సిబ్బంది మరియు నటీనటులకు సంబంధించి కూడా కొన్ని మార్పులను ఎదుర్కొంది.

కాగా ఈ చిత్రం సేనాపతి పాత్ర చుట్టూ తిరుగుతుందని చెబుతున్నారు. భారతీయుడు మొదటి భాగంలో, సేనాపతికి భారత స్వాతంత్ర్య ఉద్యమం నేపథ్యంలో ఫ్లాష్ బ్యాక్ ఉన్న విషయం తెలిసిందే. ఇక తాజాగా వినిపిస్తున్న వార్తల ప్రకారం ఇండియన్ 2 లో కూడా సేనాపతి తండ్రి కోసం ఒక శక్తివంతమైన ఫ్లాష్ బ్యాక్ ఉంటుందని తెలుస్తోంది. అంటే భారతీయుడు లాగానే సీక్వెల్ లో కూడా కమల్ హాసన్ ద్విపాత్రాభినయం చేస్తున్నారు అన్నమాట.

READ  Thalapathy67: 250 కోట్లకు పైగా జరిగిన విజయ్ - లోకేష్‌ సినిమా నాన్ థియేట్రికల్ బిజినెస్

ఈ చిత్రం సేనాపతి యొక్క కథను ప్రేక్షకులకి పరిచయం చేస్తుందని అంటున్నారు. అలాగే అతని తండ్రి ఎలా జీవించాడు మరియు స్వాతంత్ర్య పోరాటంలోకి రావడానికి సేనాపతిని ఎలా ప్రేరణ పొందేలా చేశాడు వంటి అంశాలు ఈ సినిమాలో ఉంటాయట. మరో వైపు ఈ చిత్రంలో ప్రస్తుత కాలమానంలో సమాజంలో జరిగే అవినీతి విషయాలను కూడా చూపించే సన్నివేశాలు ఉంటాయని సమాచారం.

భారతీయుడు 2 సినిమా చుట్టూ ఖచ్చితంగా భారీ హైప్ మరియు క్రేజ్ ఉంటుంది. సీక్వెల్ కావడం దాని మొదటి అడ్వాంటేజ్ అవగా, శంకర్ మరియు కమల్ హాసన్ కలయిక దీనిని మరో స్థాయికి తీసుకువెళుతుంది అనడంలో ఎలాంటి అనుమానం లేదు.

కమల్ హాసన్ నటించిన తాజా చిత్రం విక్రమ్ ను డిస్ట్రిబ్యూట్ చేసిన ఉదయనిధి స్టాలిన్ యొక్క రెడ్ జెయింట్ మూవీస్ మరోసారి భారతీయుడు 2 కోసం ఈ మహానటుడితో జతకట్టింది. ఈ చిత్రాన్ని లైకా ప్రొడక్షన్స్ నిర్మిస్తుండగా, రెడ్ జెయింట్ సహనిర్మాతగా వ్యవహరిస్తూ పంపిణీ కూడా చేయబోతుంది.

ఈ చిత్రంలో ప్రధాన పాత్రలో నటిస్తున్న కమల్ హాసన్ తో పాటు ఇతర ముఖ్య పాత్రలను కాజల్ అగర్వాల్, సిద్ధార్థ్, ప్రియా భవాని శంకర్ పోషిస్తున్నారు. కమల్ హాసన్ నటించిన విక్రమ్ చిత్రానికి అద్భుతమైన ఆల్బమ్ అందించిన అనిరుధ్ రవిచందర్ భారతీయుడు 2 కు కూడా పని చేయనున్నారు.

READ  మళ్ళీ రిపీట్ కానున్న క్రేజీ కాంబినేషన్

Follow on Google News Follow on Whatsapp


- Advertisement -
RELATED ARTICLES

Trending Stories

Recent Stories