ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఎప్పుడూ తన ఫ్యాన్ బేస్ ను తన సైన్యంగా పేర్కొన్నారు మరియు ఇతర హీరోల మాదిరిగానే, వారు తన నిజమైన బలం అని ఆయన నమ్ముతారు. అందుకే ఎప్పటికప్పుడు ఫోటో షూట్ల ద్వారా అభిమానులతో ఇంటరాక్ట్ అవుతూ ఉంటారు.
ఇక అల్లు అర్జున్ అభిమానులు తాజాగా అలాంటి ఓ ఫోటో షూట్ ను నిర్వహించమని చిత్ర బృందాన్ని కోరడంతో ఒక ఈవెంట్ ప్లాన్ చేయడం జరిగింది. అయితే ఈ ఈవెంట్ సరైన ఏర్పాట్లు, ప్లానింగ్ లేకుండా ఈ కార్యక్రమం సాగింది. ఈ కారణంగా చాలా మంది అభిమానులకు అల్లు అర్జున్ తో ఫోటో దిగే అవకాశం కూడా రాలేదు.
ఈ కార్యక్రమంలో పూర్తిగా గందరగోళం నెలకొందని, ప్రణాళిక లోపం స్పష్టంగా కనిపించిందని అభిమానులు వాపోయారు. చాలా మంది అభిమానులు గంటల తరబడి ఎదురుచూసి తమ అభిమాన హీరోతో ఫోటో దిగలేకపోవడంతో నిరాశ చెందారు. మరి అభిమానుల బాధలోనూ న్యాయం ఉంది కదా.
ఈ కార్యక్రమానికి భారీ సంఖ్యలో అభిమానులు హాజరు కావడంతో వైజాగ్ ఫోటో షూట్ ను మధ్యలోనే నిలిపివేశారు. దీంతో తీవ్ర నిరాశకు గురైన బన్నీ అభిమానులు వేదిక పై బోరున విలపించారు.
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ప్రస్తుతం పుష్ప: ది రూల్ షూటింగ్ కోసం వైజాగ్ లో ఉన్నారు. అత్యంత భారీ అంచనాల నడుమ వస్తున్న ఈ సినిమాను గ్రాండ్ గా, ఇంటర్నేషనల్ స్టేజ్ పై తెరకెక్కించనున్నారు. పుష్పరాజ్ ఎదుగుదల, భన్వర్ సింగ్ షెకావత్ తదితరులు విసిరిన కొత్త సవాళ్లను తను ఎలా ఎదుర్కొంటాడనే కథాంశంతో ఈ చిత్రం తెరకెక్కనుంది.