Homeసినిమా వార్తలులూసిఫర్ తో పోలిస్తే గాడ్ ఫాదర్ ను చాలా మెరుగుపరిచాం - మెగాస్టార్ చిరంజీవి

లూసిఫర్ తో పోలిస్తే గాడ్ ఫాదర్ ను చాలా మెరుగుపరిచాం – మెగాస్టార్ చిరంజీవి

- Advertisement -

మెగాస్టార్ చిరంజీవి నటించిన గాడ్‌ ఫాదర్ చిత్రం దసరా కానుకగా అక్టోబరు 5వ తేదీన ప్రపంచ వ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సందర్భంగా చిత్ర బృందం ప్రచార కార్యక్రమాలను వేగవంతం చేసింది. ఇందులో భాగంగా హీరో చిరంజీవి, దర్శకుడు మోహన్ రాజా తాజాగా విలేకరుల సమావేశంలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమలో రిపోర్టర్లు అడిగిన ప్రశ్నలకు చిత్ర బృందం సమాధానమిచ్చారు.

కాగా ఈ ప్రెస్ మీట్ సందర్భంగా మీడియాతో మాట్లాడిన చిరంజీవి, ఈ ప్రాజెక్ట్‌ను మరింత వేగంగా మరియు సినిమాలో బోర్ ఫీల్ రాకుండా చేయడానికి అనేక మార్పులు చేసినట్లు వెల్లడించారు. రీమేక్ చేయాలనే సూచనతో రామ్ చరణ్ తన వద్దకు వచ్చినప్పుడు, సినిమాను మళ్లీ మళ్లీ చూశానని, ఆ సమయంలో సినిమా కొన్ని చోట్ల స్లోగా, డల్ గా అనిపించిందని చిరంజీవి అన్నారు.

లూసిఫర్‌లో ఉన్న స్లో నెస్‌ గాడ్‌ ఫాదర్‌లో రాకుండా మేము చూసుకున్నాము. లూసిఫర్‌ సినిమాలో నాకు నచ్చని కొన్ని సమస్యలు ఉన్నాయి. అయితే వాటిని మా బృందం సవరించింది. సాధారణంగా నా సినిమాలు విడుదలకు ముందు ఎక్కువగా మాట్లాడను కానీ గాడ్ ఫాదర్ సినిమాని ప్రేక్షకులు తప్పకుండా ఎంజాయ్ చేస్తారు. అంతే కాక ప్రేమతో ముంచెత్తుతారని మెగాస్టార్ చిరంజీవి అన్నారు.

READ  ప్రభాస్ ను కాదని దుల్కర్ కి ఓటేసిన మృణాల్ ఠాకూర్

ఇక ఈ సినిమాలో రాజకీయ నేతలపై ఉన్న డైలాగుల గురించి అడగగా.. ఇందులో పొలిటికల్ లీడర్లపై ఎలాంటి సెటైర్లు వేయలేదని మెగాస్టార్ స్పష్టం చేశారు. ఈ సినిమా లూసిఫర్ రీమేక్‌ గా తెరకెక్కిందని, మాతృకలోని డైలాగుల ఆధారంగానే ఇందులోనూ రాసినట్లు ఆయన తెలిపారు. అయితే సినిమాలోని డైలాగులకు ఎవరైనా బుజాలు తడుముకుంటే తానేమీ చేయలేనని చిరంజీవి అన్నారు. “నేను రాజకీయం నుంచి దూరంగా ఉన్నాను. కానీ రాజకీయం నా నుంచి దూరం కాలేదు.” అనే డైలాగ్‌ను చిరంజీవి ఇటీవలే తన ట్విటర్‌లో పేర్కొన్న సంగతి తెలిసిందే.

గాడ్‌ ఫాదర్ అక్టోబరు 5న ప్రపంచ వ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు రానుంది. బాలీవుడ్ సూపర్ స్టార్ సల్మాన్ ఖాన్ ఒక ప్రత్యేక అతిథి పాత్రలో నటించారు. నయనతార ఈ సినిమాలో కీలక పాత్ర పోషించారు. సత్యదేవ్ కూడా ముఖ్యమైన ప్రతినాయక పాత్రను చేశారు.

నిరవ్ షా సినిమాటోగ్రాఫర్‌గా పనిచేస్తోన్న ఈ సినిమాలో అత్యుత్తమ సాంకేతిక చిత్ర బృందం పనిచేస్తోంది. తమన్ సంగీత సారథ్యం వహిస్తుండగా.. సురేశ్ సెల్వరాజన్ ఆర్ట్ డైరెక్టర్‌గా పనిచేస్తున్నారు. ఈ చిత్రాన్ని మెగా సూపర్ గుడ్ ఫిల్మ్స్ , కొణిదెల ప్రొడక్షన్స్ పతాకాలపై ఆర్బీ చౌదరి, ఎన్వీ ప్రసాద్, సురేఖ కొణిదెల నిర్మిస్తున్నారు.

Follow on Google News Follow on Whatsapp

READ  మైత్రీ మూవీ మేకర్స్ ను ఇరకాటంలో పెడుతున్న చిరంజీవి - బాలయ్య


- Advertisement -
RELATED ARTICLES

Trending Stories

Recent Stories