Homeసినిమా వార్తలుSai Dharam Tej: నా యాక్సిడెంట్‌ పై వచ్చిన ట్రోల్స్ కారణంగా నేను ఏడ్చాను మరియు...

Sai Dharam Tej: నా యాక్సిడెంట్‌ పై వచ్చిన ట్రోల్స్ కారణంగా నేను ఏడ్చాను మరియు కష్టపడ్డాను అని అన్న సాయి ధరమ్ తేజ్

- Advertisement -

యువ కథానాయకుడు సాయి ధరమ్ తేజ్ రెండేళ్ల క్రితం ప్రమాదానికి గురైన సంగతి అందరికీ తెలిసిందే. మృత్యువును ఎదుర్కొని విజేతగా నిలిచిన సాయి ధరమ్ తేజ్ ఇప్పుడు తన కొత్త సినిమా విరూపాక్ష తో వచ్చేందుకు ప్రేక్షకుల ముందుకు మళ్ళీ సిద్ధమయ్యారు.

“ప్ర‌కృతి నా లైఫ్‌ను నాకు వెన‌క్కి ఇచ్చింది. అంటే ఏదో ప‌ర్ప‌స్ ఉంది. నేను ఎక్క‌డి నుంచి వ‌చ్చాను. ఏమీ లేని పోజిష‌న్ నుంచి వ‌చ్చాను. యాక్సిడెంట్‌తో నేను మ‌ళ్లీ రోడ్డు మీద ప‌డ్డాను. అన్నీ తీసేసింది. శారీర‌కంగా, మాన‌సికంగా వీక్ అయిపోయాను. మాట్లాడ‌ట‌మే క‌ష్ట‌మైంది. అప్పుడు నాకు నేనుగా నేనేంటి అని తెలుసుకునే ఓ ఆధ్యాత్మిక భావ‌న‌లోకి వ‌చ్చేశాను’’ అని అన్నారు హీరో సాయిధరమ్ తేజ్.

దాదాపు రెండేళ్ల ముందు ఆయ‌న బైక్ యాక్సిడెంట్ లో గాయపడ్డారు. చాలా రోజుల వ‌ర‌కు హాస్పిట‌ల్‌, బెడ్‌కే ప‌రిమితం అయ్యారు. ఆ దశలో ఆయ‌న అభిమానులు, కుటుంబం తెగ క‌ల‌వ‌ర పడ్డారు. అయితే ఆయ‌న మెల్ల‌గా కోలుకున్నారు. ఇప్పుడు మ‌ళ్లీ సినిమాలు చేయ‌డం ప్రారంభించారు. అయితే ఈ క్ర‌మంలో ఆయ‌న చాలా ఇబ్బందిక‌ర‌మైన ప‌రిస్థితుల‌ను కూడా ఎదుర్కొన్నారు. వీటి గురించి ఆయ‌న ఇటీవలి ఇంట‌ర్వ్యూలో చెప్పుకొచ్చారు.

సాయిధరమ్ తేజ్ మాట్లాడుతూ.. యాక్సిడెంట్ జరిగిన తర్వాత నాకు మాట విలువేంటో తెలిసింది. ప్రమాదం జరిగినప్పుడు నేను షాక్‌కి గుర‌య్యాను. దాంతో మాట ప‌డిపోయింది. జ‌నాల‌కి ఆ విష‌యం తెలియ‌దు. వీడేంటి తాగేసి మాట్లాడుతున్నాడా? అని జోకులేసుకున్నారు. అలాంటి జోకులు మరియు ట్రోల్స్ వల్ల తాను ఏడ్చాను అని కూడా చెప్పారు.

కానీ మాట తిరిగి రావ‌టం కోసం ఎంత బాధ‌ప‌డ్డానో నాకు తెలుసు. చిన్న‌ప్ప‌టి నుంచి నేను చాట‌ర్ బాక్స్‌. ఈ కార‌ణంగా క్లాస్ బ‌య‌టే ఎక్కువ‌గా ఉండేవాడిని. స‌డెన్‌గా మాట ప‌డిపోయిన‌ప్పుడు దాని వాల్యూ ఏంటో తెలిసింది. మాట్లాడ‌టం అనేది ఎంత సంతోషాన్నిస్తుందో తెలుసుకున్నాను. మాట వ‌చ్చే క్ర‌మంలో నా ప‌క్క‌నుండే వాళ్లు ఎంత స‌పోర్ట్ చేశారో నాకు తెలుసు. నేను మాట్లాడ‌టానికి క‌ష్ట‌ప‌డుతున్నాన‌ని తెలిసి చాలా ఓపిక‌గా వినేవాళ్లు. సినిమాల్లో నా తోటి నటీన‌టులు, న‌టీమ‌ణులు చాలా సపోర్ట్ చేశారు.

READ  Balagam: బాక్సాఫీసు వద్ద అద్భుత వసూళ్లు సాధిస్తున్న చిన్న సినిమా బలగం

రిప‌బ్లిక్ సినిమాలో నాలుగు పేజీల డైలాగ్‌ని అవ‌లీల‌గా చెప్పేసేవాడ్ని. అలాంటిది స‌డెన్‌గా హాఫ్ పేజీ డైలాగ్ చెప్పాలంటే వ‌చ్చేది కాదు. మాట వ‌చ్చేది కాదు.. మాట రోల్ అయ్యేది. అది నాతోటి న‌టీన‌టులు అర్థం చేసుకున్నారు. అఖ‌రికి మా గురువుగారు క‌ళ్యాణ్‌గారు అరే నువ్వెక్కువ ఇబ్బంది ప‌డ‌కు.. ప‌ర్లేదు అన్నారు. డైలాగ్స్ చెప్పే స‌మ‌యంలో మైమ్ చేయ‌మ‌ని అనేవారు. దాని వ‌ల్ల నాలో తెలియ‌ని ఓ కాన్ఫిడెన్స్ వ‌చ్చింది. అలాంటిది నా పై ఏంటి 90 వేసుకుని వ‌చ్చావా.. ఏంటి మాట పోయింది అంటూ జోకులేశారు. వాళ్ల‌కు జోకుల్లాగా ఉండొచ్చు. కానీ వాళ్ల‌కు విష‌యం తెలియ‌దు. అలా అన్నోళ్ల మాట‌ల‌ను నేను ప‌ట్టించుకోలేదు. నాకు నేను ఎలా డెవ‌ల‌ప్ కావాల‌నే దాని పై నేను ఫోక‌స్ చేసుకుంటూ వ‌చ్చాను. నా యాక్టింగ్‌ను నాకు నేనుగా ఎలా ఇంప్రూవ్ చేసుకోవాలని ప్ర‌య‌త్నిస్తూ వ‌చ్చాను అని అన్నారు.

సాయిధరమ్ తేజ్ నటించిన విరూపాక్ష అనే పాన్ ఇండియా సినిమా తాజాగా విడుదలకి సిద్ధంగా ఉంది. ఈ సినిమా ఏప్రిల్ 21న రిలీజ్ అవుతుంది. కార్తీక్ దండు ద‌ర్శ‌క‌త్వం వహించారు. ఈ సినిమాకు సుకుమార్‌ కథ, స్క్రీన్‌ప్లే అందించడంతో పాటు సహా నిర్మాతగా కూడా వ్యవహరించారు. శ్రీ వెంకటేశ్వర సినీ చిత్ర బ్యానర్‌ పై బీవీఎస్‌ఎన్‌ ప్రసాద్‌ ఈ సినిమాను నిర్మించారు. కాగా సాయి ధరమ్‌ తేజ్ కు జోడీగా సంయుక్త మీనన్ నటించారు. దీనితో పాటుగా సాయిధరమ్‌ తేజ్‌.. పవన్‌ కళ్యాణ్‌తో కలిసి ‘వినోదయ సీతం’ రీమేక్‌లో నటిస్తున్నారు. సముద్రఖని దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాకు త్రివిక్రమ్‌ మాటలు అందిస్తున్నారు.

READ  Vaathi/Sir: ధనుష్ సార్ సినిమా [వాతి ] ఓటీటీ స్ట్రీమింగ్ డేట్ అండ్ రిలీజ్ పార్ట్నర్

Follow on Google News Follow on Whatsapp


- Advertisement -
RELATED ARTICLES

Trending Stories

Recent Stories