లేటెస్ట్ హీరోయిన్స్ లో యూత్ లో మంచి క్రేజ్ ఉన్న అప్ కమింగ్ హీరోయిన్ గా నేహా శెట్టి పేరును చెప్పుకోవచ్చు.
సందీప్ కిషన్ హీరోగా చేసిన గల్లీ రౌడీ సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన ఈ కన్నడ భామ, ఆ తరువాత సిద్ధు జొన్నలగడ్డ తో నటించిన డీజే టిల్లు తో ఒక్కసారిగా యూత్ హార్ట్ త్రోబ్ గా మారిపోయింది. పట్టాసు పిల్లా పాటలో తన గ్లామర్ తో కుర్రకారు మతి పోగొట్టడమే కాక బ్లాక్ సారీలో హాట్ గా కనిపించి కనులవిందు చేసింది.
చక్కని ఫిజిక్, హాట్ ఎక్స్ప్రెషన్స్ తో పాటు క్యూట్ ఫేస్ తో ఆడియెన్స్ ను ఇట్టే ఆకర్షించిన నేహా తదుపరి సినిమాగా యువ హీరో కిరణ్ అబ్బవరం తో జత కట్టనుంది.రత్నం కృష్ణ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రానికి రూల్స్ రంజన్ అనే పేరును ఖరారు చేసారు.
ఇక హీరో కిరణ్ అబ్బవరం కూడా అతి కొద్ది కాలం లోనే మంచి నటుడిగా పేరు తెచ్చుకున్నాడు.తొలి చిత్రం రాజా వారు రాణి గారు తోనే తన నటనకు చక్కని ప్రశంసలు లభించగా, ఆ పై చేసిన రెండో సినిమా ఎస్ ఆర్ కళ్యాణ మండపం సినిమా కూడా యూత్ ఫుల్ ఎంట్టైన్మెంట్ తో పాటు సెంటిమెంట్ రంగరించి హిట్ కొట్టాడు. ఆ సినిమాకి కథకుడిగా కూడా కిరణ్ పనిచేయడం విశేషం.
సో యూత్ లో మంచి ఫాలోయింగ్ ఉన్న హీరో, హీరోయిన్ కలిసి నటిస్తున్న ఈ సినిమా మంచి హిట్ గా నిలిచి ఇద్దరికీ మంచి పేరు తీసుకు వస్తుందని ఆశిద్దాం.