Homeసినిమా వార్తలుహారర్ బ్లాక్ బస్టర్ మసూదా ఓటిటి రిలీజ్ డేట్ మరియు స్ట్రీమింగ్ పార్టనర్

హారర్ బ్లాక్ బస్టర్ మసూదా ఓటిటి రిలీజ్ డేట్ మరియు స్ట్రీమింగ్ పార్టనర్

- Advertisement -

తాజా హారర్ థ్రిల్లర్ “మసూదా” త్వరలో ఓటిటీ వేదిక పైకి రావడానికి సిద్ధంగా ఉంది. ఈ ఏడాది నవంబర్ 18న విడుదలైన ఈ చిత్రం మంచి టాక్ తెచ్చుకుని ప్రేక్షకులను ఆకట్టుకుంది. శుభలేఖ సుధాకర్, సత్యం రాజేష్ కీలక పాత్రల్లో నటించిన ఈ చిత్రంలో సంగీత, తిరువీర్, కావ్య కళ్యాణ్ తదితరులు ప్రధాన పాత్రలు పోషించారు.

ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద కూడా ఎవరూ ఊహించని విధంగా అద్భుతమైన కలెక్షన్లను అందుకుంది. దర్శకుడు సాయికిరణ్ ‘మసూదా’ సినిమాను తెరకెక్కించిన తీరును ప్రేక్షకులు ప్రశంసించారు. పకడ్బందీ కథనంతో ఆయన అందరినీ థ్రిల్ చేశారు.

ఓటీటీ ప్లాట్ ఫామ్ ఆహా వీడియో ఈ సినిమా డిజిటల్ హక్కులను భారీ ధరకు కొనుగోలు చేసింది. కాగా మసూదా సినిమా డిసెంబర్ 16 న ప్రసారం అవుతుందని చెబుతున్నారు.

జేమ్స్ కామెరూన్ దర్శకత్వం వహించిన అవతార్ 2 అదే రోజున థియేటర్లలోకి రానున్న సంగతి తెలిసిందే. ఆ రోజున పెద్ద సినిమా ఏదీ థియేటర్లలో విడుదల కావడం లేదు. ఈ నేపథ్యంలో ‘మసూదా’ను ఓటీటీలో విడుదల చేయాలని ఆహా బృందం యోచిస్తున్నట్లు తెలుస్తోంది.

మసూదా చిత్రం నీలమ్ అనే అమ్మాయి కథ చెబుతుంది. తన భర్తకు దూరంగా, ఒక పాఠశాలలో ఉపాధ్యాయురాలిగా పనిచేసే ఆమె తన కుమార్తె నజియా (బంధవి శ్రీధర్)తో కలిసి ఒక అపార్ట్ మెంట్ లో నివసిస్తుంది. వారి పొరుగువాడు గోపి (తిరువీర్), తను ఒక సాఫ్ట్ వేర్ ఉద్యోగం చేస్తుంటాడు. ఒక రోజు అర్ధరాత్రి నజియా వింతగా ప్రవర్తించడం ప్రారంభిస్తుంది, గోపి వారి ఇంటికి వెళ్లి ఆమెను ఆసుపత్రికి తీసుకువెళతాడు.

READ  పాన్ వరల్డ్ సినిమాగా రూపొందనున్న మహేష్ - రాజమౌళి సినిమా

అక్కడి నుంచి సినిమా థ్రిల్లింగ్ గా మారుతుంది. దెయ్యం బారిన పడిన నజియాను గోపి ఎలా కాపాడాడు? అతను ఆమె కోసం చేసిన సాహసాలు ఏమిటి? మసూదా ఎవరు? ఇవన్నీ తెలుసుకోవాలంటే సినిమా చూడాల్సిందే.

ఈ సినిమాలో సంగీత నటనకు మంచి మార్కులు పడ్డాయి. దెయ్యం వెంటాడుతున్న కుమార్తె వింత ప్రవర్తనకు భయపడే తల్లిగా ఆమె భావోద్వేగాన్ని అద్భుతంగా పండించారు. తిరువీర్ కొంతకాలంగా ఒక రకమైన శాడిజం చూపించే పాత్రల్లో కనిపించారీ. కానీ ఈ సినిమాలో అందుకు భిన్నంగా పాజిటివ్ క్యారెక్టర్ లో చాలా బాగా నటించారు. పీర్ బాబాగా శుభలేఖ సుధాకర్, అల్లా ఉద్దీన్ పాత్రలో సత్యం రాజేష్ కూడా ఆకట్టుకున్నారు.

స్వధర్మ్ ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై నిర్మాత రాహుల్ యాదవ్ నక్కా ఈ చిత్రాన్ని నిర్మించారు. ఈ చిత్రానికి సంగీతం ప్రశాంత్ ఆర్ విహారి అందించారు. ఇంతకు ముందు ఈ నిర్మాణ సంస్థలో మళ్ళీ రావా, ఏజెంట్ సాయి శ్రీనివాస ఆత్రేయ వంటి చక్కని సినిమాలు వచ్చాయి.

Follow on Google News Follow on Whatsapp

READ  సర్దార్ సీక్వెల్ ను రెడీ చేస్తున్న కార్తీ


- Advertisement -
RELATED ARTICLES

Trending Stories

Recent Stories