ఎన్టీఆర్ తన తదుపరి చిత్రమైన ఎన్టీఆర్ 30కి దర్శకుడు కొరటాల శివతో కలిసి పని చేసేందుకు సిద్ధం అవుతున్నారు. ఈ ప్రాజెక్ట్ ఇటీవల హైదరాబాద్‌లో ప్రారంభమైంది. దాదాపు సంవత్సరం పాటు ప్రీప్రొడక్షన్ పై చిత్రబృందం పని చేస్తోందని, మరికొద్ది రోజుల్లో చిత్రీకరణ ప్రారంభించే ఆలోచనలో కొరటాల శివ ఉన్నారన్న విషయం మనకు తెలుసు. జనతా గ్యారేజ్ తర్వాత ఈ అద్భుతమైన కాంబో యొక్క రెండవ కలయికగా ఈ సినిమా రూపుదిద్దుకుంటుంది.
ఇటీవల జరిగిన భారీ లాంచ్ తరువాత, చిత్ర నిర్మాతలు వరుసగా రెండు ప్రధాన ప్రకటనలు చేసారు. మొదట, వారు ప్రఖ్యాత యాక్షన్ డిజైనర్ కెన్నీ బేట్స్‌ను చేర్చుకున్నట్లు ప్రకటించారు మరియు ఇప్పుడు ఈ భారీ ప్రాజెక్ట్ కోసం ప్రముఖ VFX సూపర్‌వైజర్ బ్రాడ్ మిన్నిచ్ తమ జట్టులో చేరనున్నట్లు వెల్లడించారు.
బ్రాడ్ మిన్నిచ్ ఇంతకు ముందు 300: రైజ్ ఆఫ్ యాన్ ఎంపైర్, ది బాట్‌మాన్, ఆక్వామాన్ సహా మరెన్నో ప్రపంచంలోని అత్యంత ప్రతిష్టాత్మకమైన ప్రాజెక్ట్ లకు తన సహకారం అందించారు. కొరటాల శివ ఈ చిత్రాన్ని భారీ కాన్వాస్ పై నిర్మిస్తామని హామీ ఇచ్చారు. హైక్వాలిటీ హాలీవుడ్ టెక్నీషియన్స్ రాకతో ఎన్టీఆర్ 30 చిత్రం సంచలనం సృష్టించేలానే కనిపిస్తుంది.
యువసుధ ఆర్ట్స్, ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యానర్ల పై మిక్కిలినేని సుధాకర్, హరికృష్ణ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ చిత్రంతో జాన్వీ కపూర్ తెలుగులో అరంగేట్రం చేస్తున్నారు. శ్రీకర్ ప్రసాద్ ప్రాజెక్ట్ ఎడిటర్. రత్నవేలు సినిమాటోగ్రఫీని, ప్రొడక్షన్ డిజైన్‌ను సాబు సిరిల్ హ్యాండిల్ చేస్తున్నారు. భారీ అంచనాలున్న ఈ యాక్షన్ ఎంటర్‌టైనర్‌ను నందమూరి కళ్యాణ్ రామ్ సమర్పిస్తున్నారు. ఈ చిత్రం ఏప్రిల్ 5, 2024న ప్రపంచ వ్యాప్తంగా విడుదల కానుంది.