Homeసినిమా వార్తలుహిట్ - 3 ట్రైలర్ : పవర్ఫుల్ & ఇంటెన్స్ 

హిట్ – 3 ట్రైలర్ : పవర్ఫుల్ & ఇంటెన్స్ 

- Advertisement -

నాచురల్ స్టార్ నాని హీరోగా యువ దర్శకుడు శైలేష్ కొలను దర్శకత్వంలో తెరకెక్కుతున్న లేటెస్ట్ యాక్షన్ ఎంటర్టైనర్ మూవీ హిట్ 3. ఇటీవల హిట్ ఫ్రాంచైజ్ లో వచ్చిన రెండు సినిమాలు బాగానే విజయం అందుకోవడంతో దీని పై మొదటి నుండి అందరిలో మంచి అంచనాలు ఏర్పడ్డాయి. ఇక ఈ మూవీలో అర్జున్ సర్కార్ అనే వయొలెంట్ పోలీస్ అధికారి పాత్రలో నాని నటిస్తుండగా కెజిఎఫ్ సినిమాల నటి శ్రీనిధి శెట్టి ఇందులో హీరోయిన్ గా నటిస్తోంది. 

ఇక ఈ మూవీ నుండి ఇటీవల రెండు సాంగ్స్, ఫస్ట్ గ్లింప్స్ టీజర్ రిలీజ్ అయి బాగానే రెస్పాన్స్ అందుకోగా నేడు థియేట్రికల్ ట్రైలర్ ని రిలీజ్ చేసారు. ముఖ్యంగా ట్రైలర్ లో వయొలెన్స్ అంశాలు ఎక్కువగా ఉన్నప్పటికీ నాచురల్ స్టార్ నాని పవర్ఫుల్ పెర్ఫార్మన్స్, కొన్ని ఇంటెన్స్ యాక్షన్ సీన్స్ బాగున్నాయి. ఫోటోగ్రఫి, బ్యాక్ గ్రౌండ్ స్కోర్ కూడా బాగుంది. 

ముఖ్యంగా ట్రైలర్ లో నిన్ను అర్జున్ అని పిలవాలా లేక సర్కార్ అని పిలవాలా అని హీరోయిన్ అడిగిన ప్రశ్నకు సమాధానం ఇస్తూ, జనాలకి అర్జున్ మృగాలకి సర్కార్ అని చెప్పిన డైలాగ్ అదిరింది. మొత్తంగా అయితే యాక్షన్ పవర్ఫుల్ అంశాలతో హిట్ 3 ట్రైలర్ ఇప్పటివరకు మూవీ పై ఉన్న అంచనాలు మరింతగా పెంచేసిందని చెప్పాలి. మిక్కీ జె మేయర్ సంగీతం అందిస్తున్న ఈ మూవీని నాని తో కలిసి యువ మహిళా నిర్మాత ప్రశాంత్ తిపిర్నేని గ్రాండ్ గా నిర్మిస్తున్నారు. ఈ మూవీ మే 1న భారీ స్థాయిలో థియేటర్స్ లో ఆడియన్స్ ముందుకి రానుంది. 

READ  Dragon OTT Release Details 'డ్రాగన్' ఓటిటి రిలీజ్ డీటెయిల్స్

Follow on Google News Follow on Whatsapp


- Advertisement -
RELATED ARTICLES

Trending Stories

Recent Stories