Homeసినిమా వార్తలుHit 3 Teaser Release Date Fix 'హిట్ - 3' టీజర్ రిలీజ్ డేట్...

Hit 3 Teaser Release Date Fix ‘హిట్ – 3’ టీజర్ రిలీజ్ డేట్ ఫిక్స్

- Advertisement -

నాచురల్ స్టార్ నాని హీరోగా యువ దర్శకుడు శైలేష్ కొలను దర్శకత్వంలో తాజాగా తెరకెక్కుతున్న మూవీ హిట్ 3. హిట్ ఫ్రాంచైజ్ లో భాగంగా రిలీజ్ అయిన హిట్ 1 సినిమాలో యువనటుడు విశ్వక్సేన్ నటించగా ఆ మూవీ మంచి విజయం అందుకుంది. 

ఆ తర్వాత వచ్చిన హిట్ 2 లో అడివి శేషు హీరోగా కనిపించగా అది కూడా మంచి విజయం అందుకుంది. తాజాగా హిట్ 3 మూవీ నాని హీరోగా వేగంగా షూటింగ్ జరుపుకుంటోంది. ఇందులో కెజిఎఫ్ సిరీస్ సినిమాల నటి శ్రీనిధి శెట్టి హీరోయిన్ గా నటిస్తున్నారు. 

అయితే ఈ సినిమాకి ఆశించిన స్థాయిలో హైప్ మాత్రం రావడం లేదు. హిట్ 1, హిట్ 2 రెండు సినిమాలు విజయవంతం అయినప్పటికీ అవి అన్ని వర్గాల ఆడియన్స్ కి చేరువ కాలేదు. వాటి అనంతరం వెంకటేష్ తో శైలేష్ తీసిన సైంధవ్ ఫ్లాప్ కావడం కూడా హిట్ 3 కి హైప్ రాకపోవడానికి కారణం. విషయం ఏమిటంటే ఫిబ్రవరి 24 న ఈ మూవీ యొక్క టీజర్ ని రిలీజ్ చేయనున్నారు టీమ్. 

READ  ​Thandel Underperformance in America అమెరికాలో ఢీలాపడ్డ 'తండేల్' 

మిక్కీ జే మేయర్ సంగీతం అందిస్తున్న ఈ సినిమాని నాని స్వయంగా తన వాల్ పోస్టర్ సినిమా సంస్థ తోపాటు యునానిమస్ ప్రొడక్షన్స్ సంస్థతో కలిసి గ్రాండ్ గా నిర్మిస్తున్నారు. కాగా హిట్ 3 మూవీ మే 1న గ్రాండ్ గా ఆడియన్స్ ముందుకి రానుండగా ఇందులో విశ్వక్సేన్ తో పాటు అడవి శేష్ చిన్న పాత్రల్లో కనిపించనున్నారు. 

Follow on Google News Follow on Whatsapp

READ  Tollywood Production House Movies in Other Industries కోలీవుడ్, బాలీవుడ్ లో దూసుకెళ్తున్న టాలీవుడ్ అగ్రనిర్మాణ సంస్థ 


- Advertisement -
RELATED ARTICLES

Trending Stories

Recent Stories