నాచురల్ స్టార్ నాని హీరోగా తెరకెక్కుతున్న లేటెస్ట్ యాక్షన్ ఎంటర్టైనర్ మూవీ హిట్ 3. హిట్ మూవీ సిరీస్ లో భాగంగా మూడవ పార్ట్ గా రూపొందుతున్న ఈ మూవీని శైలేష్ కొలను తెరకెక్కిస్తుండగా కెజిఎఫ్ సినిమాల నటి శ్రీనిధి శెట్టి ఇందులో హీరోయిన్ గా నటిస్తున్నారు.
Hit 3 Teaser was Powerful & Impressive
ముఖ్యంగా అనౌన్స్ మెంట్ నుండి అందరిలో మంచి క్రేజ్ ఏర్పరిచిన ఈ మూవీ యోక్క ఫస్ట్ గ్లింప్స్ అందరినీ ఆకట్టుకోగా నేడు నాని బర్త్ డే సందర్భంగా కొద్దిసేపటి క్రితం మూవీ టీజర్ ని రిలీజ్ చేసారు. ముఖ్యంగా టీజర్ లో విజువల్స్ తో పాటు బ్యాక్ గ్రౌండ్ స్కోర్, మరీ ముఖ్యంగా మోస్ట్ వయొలెంట్ పోలీస్ ఆఫీసర్ గా పవర్ఫుల్ మాస్ పాత్రలో కనిపించారు నాని. ముఖ్యంగా యాక్షన్ సీన్స్, ఆయన డైలాగ్స్ బాగున్నాయి.
Natural Star Nani Powerful Performance
‘ఈ కేసు వాడికి ఇవ్వడంలో ప్రాబ్లమ్ ఏమి లేదుగాని, వాడి లాఠీకి దొరికినోడి పరిస్థితి తల్చుకుని ఆలోచిస్తేనే భయం వేస్తుంది’ అంటూ రావు రమేష్ చెప్పే డైలాగ్ తో అర్జున్ సర్కార్ పాత్ర యొక్క పవర్ మనకు అర్ధమవుతుంది. మొత్తంగా అందరినీ ఆకట్టుకుంటున్న ఈ టీజర్ ప్రస్తుతం బాగానే వ్యూస్ సొంతం చేసుకుంటుంది. వాల్ పోస్టర్ సినిమా, యూనానిమస్ ప్రొడక్షన్స్ సంస్థల పై ప్రశాంతి తిపిర్నేని, నాని కలిసి నిర్మిస్తున్న ఈ మూవీ మే 1 న గ్రాండ్ గా ఆడియన్స్ ముందుకి రానుంది. మరి ఈ మూవీతో నాచురల్ స్టార్ నాని ఎంత మేర విజయం సొంతం చేసుకుంటారో చూడాలి.