నాచురల్ స్టార్ నాని తాజాగా శైలేష్ కొలను దర్శకత్వంలో చేస్తున్న యాక్షన్ థ్రిల్లింగ్ ఎంటర్టైనర్ మూవీ హిట్ 3. ఈ మూవీలో కెజిఎఫ్ సినిమాల ఫేమ్ శ్రీనిధి శెట్టి హీరోయిన్ గా నటిస్తుండగా వాల్ పోస్టర్ సినిమా, యూనానిమస్ ప్రొడక్షన్స్ సంస్థల పై ప్రశాంతి తిపిర్నేని తో కలిసి నాని గ్రాండ్ గా నిర్మిస్తున్నారు.
ఇప్పటికే ఈ మూవీ నుండి రిలీజ్ అయిన ఫస్ట్ లుక్ పోస్టర్స్, టీజర్ అందరినీ ఆకట్టుకుని మూవీ పై మంచి అంచనాలు ఏర్పరిచాయి. విషయం ఏమిటంటే, ఈ మూవీ నుండి ప్రేమ వెల్లువ అనే పల్లవితో సాగే మెలోడియస్ సాంగ్ ని మార్చి 24న రిలీజ్ చేయనున్నట్లు నేడు కొద్దిసేపటి క్రితం మేకర్స్ ఒక పోస్టర్ ద్వారా అనౌన్స్ చేసారు.
ఇప్పటికే హిట్ సిరీస్ లో రిలీజ్ అయిన రెండు సినిమాలు బాగానే ఆకట్టుకున్నప్పటికీ లాంగ్ రన్ లో అంతగా ఆకట్టుకోలేదు. కాగా హిట్ 3 ఏమాత్రం ఆడియన్స్ ని నాని ఫ్యాన్స్ ని నిరాశపరచదని, ఇందులో అర్జున్ సర్కార్ గా నాని పవర్ఫుల్ పెర్ఫార్మన్స్ ఎంతో ఆకట్టుకుంటుందని టీమ్ ఆశాభావం వ్యక్తం చేస్తోంది.
కాగా టీజర్ ని బట్టి చూస్తే ఇందులో అర్జున్ సర్కార్ పాత్ర ఒకింత వయొలెంట్ గా కూడా ఉండనున్నట్లు తెలుస్తోంది. మిక్కీ జె మేయర్ సంగీతం అందిస్తున్న హిట్ 3 మూవీ సమ్మర్ కానుకగా మే 1న గ్రాండ్ గా ఆడియన్స్ ముందుకి రానుంది.