టాలీవుడ్ నటుడు నాచురల్ స్టార్ నాని ప్రస్తుతం కెరీర్ పరంగా మంచి జోరు మీద కొనసాగుతున్నారు. ఇప్పటికే దసరా, హాయ్ నాన్న సినిమాలతో వరుసగా రెండు సక్సెస్ లు అందుకున్న నాని, తాజాగా యువ దర్శకుడు వివేక్ ఆత్రేయ తీసిన సరిపోదా శనివారంతో మరొక సక్సెస్ అందుకుని కెరీర్ పరంగా హ్యాట్రిక్ సొంతం చేసుకున్నారు.
ఈ మూవీలో ప్రియాంక మోహన్ హీరోయిన్ గా నటించగా డివివి ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై దానయ్య నిర్మించారు. తాజాగా ఆడియన్స్ ముందుకి వచ్చిన సరిపోదా శనివారం మూవీ బాక్సాఫీస్ వద్ద మంచి విజయం అందుకుని ప్రస్తుతం బాక్సాఫీస్ వద్ద కొనసాగుతుంది. అయితే దీని తరువాత హిట్ ఫ్రాంచైజ్ లోని హిట్ 3 మూవీ చేసేందుకు సిద్ధమయ్యారు నాని. హిట్ 2 మూవీ క్లైమాక్స్ లో నాని ఇచ్చిన ఎంట్రీ అందరినీ ఆకట్టుకుంది.
కాగా హిట్ 3 మూవీ యొక్క అఫీషియల్ అనౌన్స్ మెంట్ రేపు అనగా సెప్టెంబర్ 5న ఉదయం 11 గం. 4 ని. లకు రానుందని స్వయంగా నాని తన ట్విట్టర్ అకౌంట్ ద్వారా తెలిపారు. అలానే ఈ మూవీకి సంబందించిన పూర్తి వివరాలు రేపు వెల్లడి కానున్నాయి. ఇక ఈ మూవీ నాని కెరీర్ 32వ మూవీగా రూపొందనుండగా దీనిని అనంతరం శ్రీకాంత్ ఓదెల, సుజీత్ లతో కూడా సినిమాలు చేయనున్నారు నాని.