Homeబాక్సాఫీస్ వార్తలుహిట్ 2: 2 డేస్ వరల్డ్ వైడ్ కలెక్షన్స్

హిట్ 2: 2 డేస్ వరల్డ్ వైడ్ కలెక్షన్స్

- Advertisement -

ఈ వారాంతంలో విడుదలైన హిట్ 2 చిత్రం బాక్సాఫీస్ వద్ద చాలా బాగా ఆడుతోంది. ఎంతలా అంటే కేవలం రెండు రోజుల్లోనే బ్రేక్ ఈవెన్ విలువలో 60% వసూలు చేసింది. ఈ చిత్రం ఇప్పటి వరకు ప్రపంచవ్యాప్తంగా 11 కోట్ల షేర్ ను వసూలు చేసింది.

హిట్ 2 తో అడివి శేష్ బాక్సాఫీస్ సత్తా చూపించారు. తను ఇప్పుడు తెలుగు బాక్సాఫీస్ వద్ద స్టార్ గా అవతరించారు. అంచెలంచెలుగా కొత్త తరహా సినిమాలతో తనకంటూ ఒక ముద్రను క్రియేట్ చేసుకున్న అడివి శేష్, హిట్ 2 కలెక్షన్స్ తో తెలుగు చిత్ర పరిశ్రమలోని టైర్ -2 హీరోల జాబితాలో స్థానం సంపాదించారు.

ఈ చిత్రానికి సీక్వెల్ అడ్వాంటేజ్ ఉన్నప్పటికీ అడివి శేష్ తెచ్చిన ఫ్లాంబోయెన్స్ మరియు ఎక్స్ ఫ్యాక్టర్ ను మనం విస్మరించలేము. నిస్సందేహంగా, అడివి శేష్ ఈ చిత్రం యొక్క ప్రధాన బలం అని చెప్పవచ్చు. ఆ అంశమే హిట్ 2 బాక్స్ ఆఫీస్ రేంజ్ కు సహాయపడింది.

READ  కాంతార OTT రిలీజ్ డేట్ - స్ట్రీమింగ్ పార్టనర్ డీటైల్స్

హిట్ 2 సినిమా థియేట్రికల్ వాల్యూ 16.5 కోట్లు కాగా, ప్రస్తుతం వస్తున్న కలెక్షన్స్ చూస్తే అది చాలా సులభంగా కనిపిస్తోంది. పర్ఫెక్ట్ థ్రిల్లర్ గా తెరకెక్కిన ఈ సినిమా వీకెండ్ లో అద్భుతమైన వినోదాన్ని ప్రేక్షకులకు అందించింది.

సరైన ప్రమోషన్స్ తో డిఫరెంట్ తరహా సినిమాలను తీస్తే ప్రేక్షకులు తప్పకుండా ఆదరిస్తారని హిట్ 2 కలెక్షన్స్ మరోసారి ప్రూవ్ చేశాయి. చాలా మంది టైర్ -2 హీరోల సినిమాల లైఫ్ టైమ్ నెంబర్లు హిట్-2 2 రోజుల కలెక్షన్స్ కు సమానంగా ఉండటం గమనార్హం.

నిర్మాతగా పరిమిత బడ్జెట్ తో హిట్ 2 తీయాలనే నాని ఆలోచన తెలివైనదే, కానీ ఇప్పుడు వస్తున్న థియేట్రికల్ రిటర్న్స్ చూసి బహుశా ఆయన ఎంతో ఆనందిస్తూ ఉంటారు. కాగా హిట్ 2 చివర్లో చూపించినట్లుగా రాబోయే హిట్ 3 లో అర్జున్ సర్కార్ గా నాని ప్రధాన పాత్ర పోషిస్తున్నందున మూడవ భాగంతో హిట్ సిరీస్ యొక్క క్రేజ్ ను ఆయన హీరోగా కూడా ఆస్వాదిస్తారు.

Follow on Google News Follow on Whatsapp

READ  హిట్ 2 సినిమాతో అఫిషియల్ గా టైర్-2 హీరోల లిస్ట్ లో చేరిన అడివి శేష్


- Advertisement -
RELATED ARTICLES

Trending Stories

Recent Stories