Homeసినిమా వార్తలుRRR: తెలుగు చిత్ర పరిశ్రమలో చారిత్రాత్మక ఘట్టం - ఆర్ఆర్ఆర్ కు దక్కిన ఆస్కార్ అవార్డు

RRR: తెలుగు చిత్ర పరిశ్రమలో చారిత్రాత్మక ఘట్టం – ఆర్ఆర్ఆర్ కు దక్కిన ఆస్కార్ అవార్డు

- Advertisement -

తెలుగు సినీ ప్రేమికులంతా ఎంతో ఆశగా ఎదురుచూస్తు వస్తున్న క్షణం ఈ రోజు వచ్చింది. తీర్పు వెలువడి 2023 ఆస్కార్ అవార్డ్స్ ను నాటు నాటు గెలుచుకుంది! ఆస్కార్ లో బెస్ట్ ఒరిజినల్ సాంగ్ కేటగిరీలో భారతీయ సినిమా నుంచి అవార్డు గెలిచిన తొలి పాటగా ఈ పాట చరిత్ర సృష్టించింది.

https://twitter.com/RRRMovie/status/1635114639775399937?t=A1mY46CPwJ8XBBcto9BYtQ&s=19

దర్శకధీరుడు ఎస్ ఎస్ రాజమౌళి తెరకెక్కించిన ‘ఆర్ఆర్ఆర్’ చిత్రంలోని నాటు నాటు ఉత్తమ పాట కేటగిరీలో ఆస్కార్ అవార్డును గెలుచుకుంది. Applause (Tell It Like a Woman), Hold My Hand (Top Gun Maverick), Lift Me Up (Black Pather Wakanda Forever), and This is a Life (Everything Everywhere All at Once) వంటి ఇతర నామినీలను ఓడించి ఈ ఘనత సాధించింది. సంగీత దర్శకుడు ఎం.ఎం.కీరవాణి నమస్తే అని చెప్తూ అవార్డును స్వీకరించారు.

ఫలితంగా, ఈ అవార్డును గెలుచుకున్న మొట్టమొదటి భారతీయ సినిమాలోని పాటగా ఈ చిత్రం నిలిచింది. స్లమ్ డాగ్ మిలియనీర్ చిత్రంలోని జై హో పాట 2009లో ఇదే కేటగిరీలో అవార్డు గెలుచుకున్న తర్వాత ఈ ప్రతిష్టాత్మక అవార్డును గెలుచుకున్న రెండో భారతీయ పాటగా కూడా నిలిచింది.

READ  RRR - KGF 2: కేజీఎఫ్ 2ను క్రాస్ చేసి ఆల్ టైమ్ టాప్ 3 బిగ్గెస్ట్ గ్రాసర్ గా నిలిచిన ఆర్ఆర్ఆర్

ఈ రోజు ఆస్కార్ అవార్డ్స్ లో నాటు నాటు క్రేజ్ అంతా ఇంతా కాదు. వేడుక ప్రారంభంలో, జిమ్మీ కిమ్మెల్ ను నాటు నాటు హుక్ స్టెప్ ను ప్రదర్శించిన నృత్యకారులు స్టేజ్ నుండి పక్కకి తప్పించడానికి ప్రయత్నిస్తూ ప్రేక్షకులను తమ స్పూఫ్ తో అలరించారు.

https://twitter.com/RRRMovie/status/1635086204529168386?t=w6xzXZ8u3PLIYAjM-8-wxQ&s=19

ఇక ఈ పాటకి తమదైన ఎనర్జిటిక్ పెర్ఫామెన్స్ తో గాయకులు రాహుల్ సిప్లిగంజ్, కాలా భైరవ స్టేజ్ పై లైవ్ పెర్ఫార్మెన్స్ ఇచ్చారు. రామ్ చరణ్, ఎన్టీఆర్ లు లైవ్ పెర్ఫామెన్స్ ఇవ్వకపోయినా డ్యాన్సర్లు స్టేజ్ ను ఆక్రమించి నిప్పులు చెరిగే తరహాలో అదరగొట్టారు. ఆ డ్యాన్సర్లలో లారెన్ గాట్లీబ్ కూడా ఒకరు. కాగా ఈ ప్రదర్శనకు ప్రేక్షకుల నుంచి స్టాండింగ్ ఒవేషన్ కూడా లభించడం విశేషం.

https://twitter.com/RRRMovie/status/1635094135748329473?t=UBHqglZ7ZdxBDq3E6RJ6DQ&s=19

Follow on Google News Follow on Whatsapp

READ  Samyuktha Menon: సార్ సినిమా సక్సెస్ మీట్‌లో ఓ న్యూస్ యాంకర్‌ పై కౌంటర్ ఇచ్చిన నటి సంయుక్త మీనన్


- Advertisement -
RELATED ARTICLES

Trending Stories

Recent Stories