Homeసినిమా వార్తలుసాయి పల్లవి కి కోర్టులో చుక్కెదురు

సాయి పల్లవి కి కోర్టులో చుక్కెదురు

- Advertisement -

వివాదాస్పద వ్యాఖ్యల కేసులో ప్రముఖ సినీ నటి సాయి పల్లవి దాఖలు చేసిన పిటిషన్‌ ను తెలంగాణ హైకోర్టు కొట్టి వేసింది. కాశ్మీర్‌ ఫైల్స్‌ సినిమాతో పాటు గోరక్షకుల పై సాయిపల్లవి వివాదాస్పద వ్యాఖ్యలు చేసినందుకు గానూ హైదరాబాద్‌ సుల్తాన్‌ బజార్‌ పోలీసులకు భజరంగ్‌దళ్‌ నాయకులు ఇటీవల ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే.అయితే భజరంగ్‌దళ్‌ నాయకుల ఫిర్యాదు పై న్యాయ సలహా తీసుకొని కేసు నమోదు చేసిన పోలీసులు సాయిపల్లవికి గత నెల 21న నోటీసులు జారీ చేశారు. ఈ నేపథ్యంలో ఆ నోటీసులు రద్దు చేయాలని కోరుతూ సాయి తెలంగాణ హైకోర్టును ఆశ్రయించారు. సాయి పల్లవి అభ్యర్థనను తోసిపుచ్చిన హైకోర్టు ఆమె పిటిషన్‌ను కొట్టివేసింది.

వేణు ఉడుగుల దర్శకత్వం వహించి.. రానా దగ్గుబాటి హీరోగా, సాయిపల్లవి హీరోయిన్‌గా నటించిన విరాట పర్వం సినిమా జూన్ 17న విడుదలైంది. అంతకుముందు ఈ సినిమా ప్రచారంలో భాగంగా ఇంటర్వ్యూలు ఇచ్చిన సాయిపల్లవి ఆ క్రమంలోనే జరిగిన ఒక ఇంటర్వ్యూలో వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. గోరక్షకులను కాశ్మీర్‌లో ఉగ్రవాదులతో పోల్చుతారా? అంటూ భజరంగ్ దళ్ నేతలు సాయిపల్లవిపై మండిపడుతున్నారు. అసలు ఆమెకు ఏమైనా జ్ఞానం ఉందా? అని ప్రశ్నిస్తున్నారు.

ఎవరిది తప్పు, ఎవరిది ఒప్పు అని చెప్పలేం.. కొన్ని రోజులముందు కూడా ది కాశ్మీర్ ఫైల్స్ అనే సినిమా వచ్చింది కదా.. ఆ టైమ్‌లో ఉన్న కాశ్మీరీ పండిట్లను ఎలా చంపారో చూపించారు కదా.. ? మనం మత ఘర్షణలా చూస్తే.. ఇటీవల ఒక బండిలో ఎవరో ఆవులను తీసుకెళ్తున్నారు. ఆ బండిని నడుపుతున్న వ్యక్తి ముస్లిం కాబట్టి, అతను ఆ ఆవులను చంపడానికి తీసుకు వెళ్తున్నాడు అనే అనుమానంతో అతనిని కొట్టి జై శ్రీరామ్ అన్నారు. అప్పుడు జరిగిన దానికి ఇప్పుడు జరిగినదానికి తేడా ఎక్కడవుంది.? మతాలు కాదు మనం మంచి వ్యక్తిగా ఉండటం ముఖ్యం అని, ఇతరులను బాధించకూడదని.. లెఫ్టిస్ట్ అయినా రైటిస్ట్ అయినా మనం మంచిగా ఉండకపోతే న్యాయం ఎక్కడా ఉండదు. అందుకే నేను సాధ్యమైనంత వరకూ న్యూట్రల్‌గా ఉంటాను.. అంటూ సాయిపల్లవి సదరు ఇంటర్య్వూలో చెప్పుకొచ్చారు.

READ  Box-Office అంటే సుందరానికీ నాలుగవ రోజు కలెక్షన్ లు పెద్ద షాక్

ఆ తర్వాత ఈ వ్యాఖ్యలు సోషల్ మీడియాలో దుమారం రేపాయి. ఈ క్రమంలోనే భజరంగ్ దళ్ నాయకులు కాశ్మీర్ ఫైల్స్ సినిమాతోపాటు గోరక్షకులపై సాయిపల్లవి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారని, గోరక్షకులను కాశ్మీర్ ఉగ్రవాదులతో పోల్చారని ఆరోపిస్తూ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు కేసు నమోదు చేశారు పోలీసులు.

Follow on Google News Follow on Whatsapp


- Advertisement -
RELATED ARTICLES

Trending Stories

Recent Stories