Homeసినిమా వార్తలుTollywood: హీరోలు - నిర్మాతలు సక్సెస్ ఫుల్ సినిమా అంటే ఏమిటో అర్థం చేసుకోవాలి

Tollywood: హీరోలు – నిర్మాతలు సక్సెస్ ఫుల్ సినిమా అంటే ఏమిటో అర్థం చేసుకోవాలి

- Advertisement -

తెలుగు సినిమా పరిశ్రమ ఈమధ్య కొత్త ట్రెండ్ మొదలయింది. చాలా మంది నిర్మాతలు మరియు హీరోలు తమ సినిమా తొలి రోజు మార్నింగ్ షో ముగిసిన వెంటనే తమ సినిమాలు విజయం సాధించాయి అని ప్రకటించడం ప్రారంభించారు. చాలా మంది నిర్మాతలు, చిత్ర యూనిట్ మరియు నటీనటులు కలెక్షన్లతో పోస్టర్ లను విడుదల చేసి, అయా సినిమాలు బ్లాక్‌బస్టర్ హిట్ అని చెప్పే ట్రెండ్‌ను ప్రారంభించారు.

ఆశ్చర్యమైన విషయం ఏమిటంటే కేవలం సినిమా విడుదలైన రెండు రోజులు లేదా మూడు రోజుల్లో బ్రేక్‌ ఈవెన్ మార్క్ సాధించాయి అని ప్రచారం చేయడం పరిపాటిగా మారింది. కానీ నిజానికి ఆ సినిమాలు ఏవీ ఆ చిత్ర యూనిట్ చెప్పిన స్థాయిలో విజయాలు సాధించలేదు.

ఇలా వాస్తవానికి పూర్తిగా భిన్నమైన ప్రకటనలు చేయడం ఎక్కువగా జరుగుతుంది. పోనీ అంత ప్రచారం చేసుకున్న తర్వాత అయినా ఆ సినిమాలు హిట్ అయ్యాయా లేదా అంటే కనీసం వాటి రన్ ముగిసే సమయానికి కూడా సినిమాలు బ్రేక్‌ఈవెన్ మార్క్‌ను కూడా తాకకపోవడం గమనార్హం. ఇలాంటి అబద్ధపు ప్రచారాలతో తమ పేలవమైన అవుట్‌పుట్‌ను విజయవంతమైన చిత్రంగా నమ్మమని ప్రేక్షకులను బలవంతం చేయలేరని హీరోలు మరియు నిర్మాతలు అర్థం చేసుకోవాలి.

READ  పద్మశ్రీ పురస్కారం అందుకున్న సంగీత దర్శకుడు ఎంఎం కీరవాణి

కలెక్షన్లు మాత్రమే బాక్సాఫీస్ వద్ద సినిమా విజయాన్ని నిర్దేశిస్తాయి. ఇటీవలి కేవలం ఒక రోజు వ్యవధిలో సినిమాలు బ్రేక్ ఈవెన్ సాధించిన పోస్టర్లను విడుదల చేయడం మనం చాలా సందర్భాలలో చూశాము. ఇది మూర్ఖత్వం తప్ప మరొకటి కాదు అనే చెప్పాలి. ప్రేక్షకులు కూడా అన్నీ గమనిస్తూ ఉంటారు కాబట్టీ ఈ వ్యూహాల ద్వారా వారు మోసపోరు. అయినా కూడా నిర్మాతలు ఇదే పద్ధతిని కొనసాగిస్తే ఇది మరింత ప్రతికూలతను పెంచుతుంది మరియు ట్రోల్‌లను ఆహ్వానిస్తుంది.

Follow on Google News Follow on Whatsapp

READ  Vijay fans: తెలుగు రాష్ట్రాల్లో సార్ మూవీ కలెక్షన్స్ చూసి అసూయపడుతున్న విజయ్ అభిమానులు


- Advertisement -
RELATED ARTICLES

Trending Stories

Recent Stories