Home సినిమా వార్తలు తమిళ హీరో విశాల్ కు షూటింగ్ లో ప్రమాదం

తమిళ హీరో విశాల్ కు షూటింగ్ లో ప్రమాదం

Actor Vishal Was Injured On Shoot During A Fight Sequence

సినిమా రంగం అనేది ఒక మాయాజాలంతో కూడుకున్న రంగుల ప్రపంచం. వెండి తెర పై జరిగేది అంతా కల్పితం అని, బొమ్మల కొలువు మాదిరిగా కంప్యూటర్ గ్రాఫిక్స్ వంటి అదనపు హంగులు ఉంటాయి అని కూడా ప్రేక్షకులకు తెలుసు. అలాగే సినిమాల్లో ఫైట్లు హీరో నిజంగా చేయడు, వైర్ వర్క్, డూప్ ల ద్వారా ఆ సన్నివేశాలను చిత్రీకరిస్తారు. అయితే కొన్ని సందర్బాలలో హీరోలు డూప్ ల మీద ఆధార పడకుండా సొంతంగా స్టంట్స్ చేస్తుంటారు. అలాంటి సమయంలో వారు గాయాలకు గురి కావడం కూడా జరుగుతుంది. తాజాగా అలాంటి అనుకోని పరిస్థితుల్లో హీరో విశాల్ గాయపడ్డారు అని తెలియ వచ్చింది.

తన తాజా చిత్రం అయిన మార్క్ ఆంటోని షూటింగ్ సమయంలో, హీరో విశాల్ ప్రమాదానికి గురవడంతో.. ఆయనకు వెంటనే చికిత్స చేయవలసి వచ్చింది. ఇలా యాక్షన్ సన్నివేశాలు చిత్రీకరిస్తున్న సమయంలో గాయ పడటం హీరో విశాల్ కు ఇదే మొదటిసారి కాదు. అయన గతంలో లాఠీ అనే సినిమా షూటింగ్ సమయంలో ఒక ఫైట్ సీక్వెన్స్ చేస్తున్నప్పుడు కూడా చేయి విరిగింది.

ఇక మార్క్ ఆంటోని సినిమా షూటింగ్ లో జరిగిన ప్రమాదంలో తీవ్రత ఎంత అనేది తెలియనప్పటికీ, చిత్ర బృందంలో ఎక్కువ మందిని ఆసుపత్రికి తరలించినట్లు సమాచారం. అదృష్టవశాత్తూ యూనిట్ లో ఎవరికీ ఎటువంటి ప్రాణనష్టం జరిగినట్లు దాఖలాలు లేవని తెలిసింది. ఈ సందర్భంగా గాయపడిన యూనిట్ సభ్యులు అందరూ త్వరగా కోలుకోవాలి అని ఆశిద్దాం.

ఓ ఫైట్ సీక్వెన్స్‌లో భాగంగా విశాల్‌ను తీవ్రంగా కొట్టినపుడు ఈ ప్రమాదం జరిగినట్లు సమాచారం. దీంతో ఆయన కాళ్లకు బలమైన గాయాలు తగలడంతో ఆస్పత్రికి తరలించారట. ప్రస్తుతం విశాల్.. ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో వైద్యుల పర్యవేక్షణలో చికిత్స పొందుతున్నారట.

ప్యాన్ ఇండియా చిత్రాల జాబితాలో విశాల్ తొలిసారి ప్రయత్నిస్తున్న చిత్రం మార్క్ ఆంటోనీ. ప్రస్తుతం ఈ సినిమానే కాకుండా, లాఠీ అనే మరో చిత్రంలో కూడా పని చేస్తున్నారు విశాల్, అందులో ఒక పవర్ఫుల్ పోలీసు పాత్రను పోషిస్తున్నారు. ఇక మార్క్ ఆంటోనీ చిత్రంలో ప్రముఖ నటుడు, దర్శకుడు ఎస్‌జె సూర్య కూడా ఒక ముఖ్యమైన పాత్రలో నటిస్తున్నారు. జివి ప్రకాష్ ఈ చిత్రానికి సంగీత దర్శకుడుగా వ్యవహరిస్తున్నారు.

Follow on Google News Follow on Whatsapp




Show comments
Exit mobile version