Homeసినిమా వార్తలుకన్ఫ్యూజన్ లో ఉన్న వరుణ్ తేజ్

కన్ఫ్యూజన్ లో ఉన్న వరుణ్ తేజ్

- Advertisement -

సినిమా ఇండస్ట్రీ అంటేనే లాటరీ టికెట్ లాంటిది. ఒక్కోసారి ఎందుకు విజయాలు వరిస్తాయో తెలీదు. ఇంకోసారి ఎందుకు వరుస పరాజయాలు వస్తాయో తెలీదు. ఏం చేస్తే ప్రేక్షకులు మెచ్చుకుంటారు అనేది తెలియక ఒక్కోసారి పరిస్థితులు గందరగోళంగా తయారవుతాయి. ఇప్పుడు అలాంటి పరిస్థితే హీరో వరుణ్ తేజ్ కు వచ్చింది.

వరుణ్ తేజ్ తాజా సినిమా గని బాక్సాఫీస్ వద్ద భారీ ఫ్లాప్ అయింది, ఫ్3 సినిమా ఎబొవ్ యావరేజ్ గా నిలిచినా అది మరో సీనియర్ హీరో వెంకటేష్‌ తో కలిసి నటించిన ఫ్రాంచైజీ సినిమా కాబట్టి ఆ సినిమాలో వరుణ్ ఒక్కరికే క్రెడిట్ ఇవ్వలేము.

2019 లో ఫ్2 సినిమా తరువాత ‘గద్దలకొండ గణేష్’తో హిట్ ని దక్కించుకున్నారు వరుణ్. ఆ తరువాత ఎంతో ఇష్టపడి, శరీరాకృతిని మార్చుకుని మరీ కష్టపడి చేసిన స్పోర్ట్స్ డ్రామా ‘గని’ ఊహించని విధంగా భారీ డిజాస్టర్ గా నిలిచింది. ఆ తరువాత ‘ఎఫ్ 3’తో ఫరవాలేదనిపించినా.. ఒక మంచి హిట్ ని దక్కించుకునేందుకు తదుపరి ఏ సినిమా చేయాలనే విషయంలో డైలమాలో ఉన్నారు వరుణ్ తేజ్, దర్శకుడు ప్రవీణ్ సత్తారుతో ఒక ప్రాజెక్ట్‌కు సంతకం చేశారు, అయితే ప్రస్తుతం ఈ సినిమా గురించి పునరాలోచనలో ఉన్నారట. ఇప్పటికే ఈ సినిమాని అధికారికంగా ప్రకటించారు. అయితే సినిమాను ప్రకటించి నెలలు కావస్తున్నా దీనికి సంబంధించి ఎలాంటి వార్త కూడా బయటకి రాలేదు.

READ  ఏజెంట్ టీజర్: అదరగొట్టిన అఖిల్

ఇక తాజాగా వినిపిస్తున్న సమాచారం ప్రకారం దర్శకుడు ప్రవీణ్ సత్తారు ఈ సినిమాని పక్కన పెట్టినట్టుగా వార్తలు వినిపిస్తున్నాయి. ఇప్పుడప్పుడే ఈ సినిమాని ప్రారంభించే ఉద్దేశం అటు హీరో వరుణ్ తో పాటు చిత్ర నిర్మాతలకు కూడా లేదట. వినడానికి కాస్త చిత్రంగానే ఉంటుంది మరి.

ప్రస్తుతం ప్రవీణ్ సత్తారు .. కింగ్ నాగార్జున తో ‘ది ఘోస్ట్’ సినిమా చేస్తున్న విషయం తెలిసిందే. మరి ఈ సినిమా రిలీజ్ అయిన తరువాత వరుణ్ – ప్రవీణ్ సత్తారు సినిమాపై కాస్త స్పష్టత వస్తుందేమో చూడాలి. మొత్తానికి ఒక్క ఫ్లాప్ తో వరుణ్ తేజ్ కెరీర్ సంకటంలో పడింది. మరి ఈ మెగా ప్రిన్స్ తొందరలోనే చక్కని సినిమా తీసి తిరిగి పుంజుకుంటారాని ఆశిద్దాం

Follow on Google News Follow on Whatsapp

READ  కార్తీకేయ-2 ఓటిటి రిలీజ్ డీటైల్స్


- Advertisement -
RELATED ARTICLES

Trending Stories

Recent Stories