కోలీవుడ్ స్టార్ యాక్టర్ సూర్య అక్టోబర్ 10న గ్రాండ్ పాన్ ఇండియన్ మూవీ కంగువ ద్వారా ఆడియన్స్ ముందుకి రానున్నారు. శివ తెరకెక్కిస్తున్న ఈ సోషియో యాక్షన్ ఎంటర్టైనర్ మూవీలో దిశా పటాని హీరోయిన్ గా నటిస్తోంది. ఇక ప్రస్తుతం మరోవైపు యువ దర్శకుడు కార్తీ సుబ్బరాజ్ దర్శకత్వంలో ఒక యాక్షన్ మూవీ చేస్తున్నారు సూర్య.
దీనిని తన సొంత బ్యానర్ 2డి ఎంటర్టైన్మెంట్స్ పై సహా నిర్మాతగా గ్రాండ్ గా నిర్మిస్తున్నారు సూర్య. సంతోష్ నారాయణన్ సంగీతం అందిస్తున్న ఈ మూవీలో అందాల భామ పూజా హెగ్డే హీరోయిన్ గా నటిస్తున్నారు. ప్రస్తుతం ఈ మూవీ యొక్క తాజాగా షెడ్యూల్ ఊటీలో జరుగుతోంది. అందులో భాగంగా ఒక యాక్షన్ సీన్ తీస్తున్న సమయంలో హఠాత్తుగా హీరో సూర్యకు గాయాలు కావడంతో వెంటనే స్పందించిన టీమ్ స్థానిక ప్రైవేట్ ఆసుపత్రికి ఆయనని తరలించారు.
అయితే సూర్యకు పెద్దగా ప్రమాదమేమీ లేదని, కొద్దిపాటి గాయాలవడంతో వాటికి డాక్టర్లు వెంటనే శస్త్ర చికిత్స అందించినట్లు టీమ్ క్లారిటీ ఇచ్చింది. అనంతరం సూర్య చెన్నై వెళ్లిపోయారట, త్వరలో ఈ షెడ్యూల్ ని కొనసాగించేందుకు టీమ్ ప్లాన్ చేస్తున్నారు. సూర్య కెరీర్ 44వ మూవీగా రూపొందుతున్న ఈ క్రేజీ ప్రాజక్ట్ పై అందరిలో మంచి అంచనాలు ఉన్నాయి. త్వరలో దీనికి సంబంధించి పూర్తి వివరాలు వెల్లడి కానున్నాయి.