Homeసినిమా వార్తలుNani: ఓ నెటిజన్ అడిగిన ప్రశ్నకు ధీటైన సమాధానం ఇచ్చిన హీరో నాని

Nani: ఓ నెటిజన్ అడిగిన ప్రశ్నకు ధీటైన సమాధానం ఇచ్చిన హీరో నాని

- Advertisement -

హీరో నాని తన తాజా చిత్రం దసరాతో ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధం అవుతున్నారు. ఈ సినిమా పై చాలా కాన్ఫిడెంట్ గా కనిపిస్తున్న నాని ఈ సినిమా ప్రమోషన్స్ లో పలుమార్లు ఇదే విషయాన్ని పునరుద్ఘాటించారు. ప్రమోషన్స్ లో భాగంగా ఈరోజు సాయంత్రం తన అభిమానులు, సోషల్ మీడియా యూజర్లతో ముచ్చటించారు.

ఈ సందర్భంగా ఓ నెటిజన్ నానిని ‘ఒక్కక్కని మొల్దారం కింద గుడాలు రాల్తాయ్ బైంచత్’ అనే డైలాగ్ గురించి అడిగారు. మీ సినిమాలో ఇలాంటి డైలాగ్ నేను ఊహించలేదు. దాన్ని ఎలా సమర్థిస్తారు అనిఅడగగా.. ధరణి (దసరాలో నాని పాత్ర) చెబితే తప్పకుండా జరుగుతుందని నాని చెబుతూ ఎందుకు సమర్థించుకోవాలి అని నెటిజన్ ప్రశ్నకు ధీటైన సమాధానం ఇచ్చారు. అలానే అది బైంచత్ కాదు బాంచత్ అని వివరించారు.

తెలంగాణ రాష్ట్రంలో సింగరేణి బొగ్గు గనుల నేపథ్యంలో సామాజిక ఆర్థిక పరిస్థితులు, రాజకీయ ఎత్తుగడలు, అధికారం కోసం గొడవల నేపథ్యంలో సాగే కథ ఇది. గతంలో ఎన్టీఆర్ నటించిన “నాన్నకు ప్రేమతో” (2016), రామ్ చరణ్ నటించిన “రంగస్థలం” (2018) వంటి హిట్ చిత్రాలకు సహాయకుడిగా పనిచేసిన శ్రీకాంత్ ఓదెల ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు.

READ  Sundeep Kishan: 13 ఏళ్ల తర్వాత మళ్లీ సినిమా చేయనున్న సందీప్ కిషన్ - దేవా కట్టా

ఈ సినిమా ట్రైలర్ ను మంగళవారం విడుదల చేశారు. విజువల్స్ చూస్తే వీర్లపల్లి అనే చిన్న పల్లెటూరులో బొగ్గు గనుల నేపథ్యంలో ఒక వ్యక్తి ఎదుగుదలకు సంబంధించిన తీవ్రమైన, రక్తసిక్తమైన కథలా ఈ చిత్రం కనిపిస్తుంది.

శ్రీకాంత్ ఓదెల దర్శకత్వం వహించిన ఈ చిత్రానికి సంతోష్ నారాయణన్ సంగీతం అందించగా, సత్యన్ సూర్యన్ ఐఎస్ సి సినిమాటోగ్రఫీ అందించారు. నవీన్ నూలి ఎడిటర్ గా, అవినాష్ కొల్ల ప్రొడక్షన్ డిజైనర్ గా, విజయ్ చాగంటి ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ గా వ్యవహరిస్తున్నారు. సుధాకర్ చెరుకూరి నిర్మాత.

నాని, కీర్తి సురేష్, దీక్షిత్ శెట్టి, సముద్రఖని, జరీనా వహాబ్, సాయి కుమార్, రాజశేఖర్ అనింగి తదితరులు నటించారు. తెలుగు, తమిళం, హిందీ, కన్నడ , మలయాళ భాషల్లో మార్చి 30న ఈ చిత్రాన్ని విడుదల చేయనున్నారు. తెలంగాణలోని రామగుండం గోదావరిఖని సమీపంలోని సింగరేణి బొగ్గు గనుల నేపథ్యంలో ఈ సినిమా తెరకెక్కింది.

Follow on Google News Follow on Whatsapp

READ  Dasara: ఇన్ స్టంట్ చార్ట్ బస్టర్ గా నిలిచిన నాని దసరా యొక్క చంకీల అంగీలేసి పాట


- Advertisement -
RELATED ARTICLES

Trending Stories

Recent Stories