హీరో నాగ చైతన్య కస్టడీ నుండి విడుదలయ్యారు. అబ్బే ఆయన అరెస్ట్ అయ్యారని కంగారు పడకండి. ఆయన తన తాజా సినిమా కస్టడీ షూటింగ్ పూర్తి చేసుకుని విడుదలయ్యారు. దర్శకుడు వెంకట్ ప్రభుతో నాగ చైతన్య తదుపరి చిత్రం కస్టడీ కోసం జతకట్టిన సంగతి అందరికీ తెలిసిందే. ఈ చిత్రం మోస్ట్ అవైటెడ్ అండ్ ఎక్స్‌పెయిటేషన్స్ ఉన్న సినిమాల్లో ఒకటి. ఇప్పుడు లేటెస్ట్ అప్‌డేట్ ఏంటంటే ఈ సినిమా షూటింగ్ పూర్తి చేసుకుంది. తాజా చిత్ర యూనిట్ వారు కస్టడీ ప్యాక్ అప్ అని సెట్స్ నుండి వీడియోను పంచుకున్నారు.
నాగ చైతన్య సోషల్ మీడియాలో ఈ విషయాన్ని పంచుకున్నారు. కాగా ఆయన కస్టడీని ముగించినట్లు ప్రకటించినప్పుడు సెట్స్ నుండి ఒక వీడియోలో ఆనందంగా కనిపించారు. “కట్, చెయ్ నువ్వు కస్టడీ నుండి విడుదలయ్యావు” అని దర్శకుడు చెప్పడంతో వీడియో మొదలై, నాగ చైతన్య మరియు కృతి శెట్టికి షిఫ్ట్ అవుతుంది. కాగా ఈ యువ నటీనటులు ఈ వీడియోని “మీ అందరినీ మే 12న కస్టడీకి తీసుకువెళ్లెంత వరకే ఈ విడుదల.. మిమ్మల్ని థియేటర్లు కలుస్తాం” అంటూ ముగించారు.
కస్టడీ షూటింగ్ ముగిసిన సందర్భంగా యూనిట్ మొత్తం ఆనందంతో సంబరాలు చేసుకుంటున్నట్లు వీడియోలో ఉంది. సోషల్ మీడియాలో ఈ వీడియోను షేర్ చేస్తూ, చైతన్య ఈ మే 12న మీ అందరినీ థియేటర్లలో కలుద్దాం. మీ అందరితో కలిసి పనిచేయడం చాలా సరదాగా గడిచింది అంటూ ఎంతో సంతోషంగా కనిపించారు.
ఈ చిత్రం నుండి నాగ చైతన్య ఫస్ట్ లుక్ చాలా కాలం క్రితం విడుదలైంది మరియు ఆ తర్వాత, చిత్రం నుండి పెద్దగా కంటెంట్ ఏమి రివీల్ చేయలేదు. ఈ చిత్రంలో నాగ చైతన్య ఒక పోలీస్ ఆఫీసర్ పాత్రలో కనిపించనున్నారు. కాగా ఆయన ఫస్ట్ లుక్‌లో భీకరంగా, తిరుగులేని విధంగా కనిపించారు. యువ సామ్రాట్ అని అభిమానులు ముద్దుగా పిలుచుకునే ఈ నటుడి మొదటి తెలుగు-తమిళ ద్విభాషా డ్రామా కస్టడీ. ఈ ప్రాజెక్ట్ ద్వారా దర్శకుడి తెలుగు అరంగేట్రం కూడా అవుతుంది.
కాగా ఈ చిత్రంలో కృతి శెట్టి కథానాయికగా నటిస్తున్నారు నాగ చైతన్య మరియు కృతి శెట్టిల కలయికలో ఇది రెండవ సినిమా. ఇంతకంటే ముందే వీరు ఇద్దరూ కలిసి బంగార్రాజు అనే బ్లాక్ బస్టర్ చిత్రంలో కలిసి పని చేశారు. శ్రీనివాస సిల్వర్ స్క్రీన్ బ్యానర్ పై శ్రీనివాస చిట్టూరి నిర్మిస్తున్న ఈ ప్రతిష్టాత్మక ప్రాజెక్ట్‌ని పవన్‌కుమార్ సమర్పిస్తున్నారు.
మరో ఆసక్తికరమైన విషయం ఏమిటంటే ఈ చిత్రానికి లెజెండరీ తండ్రీ కొడుకులు ఇసైజ్ఞాని ఇళయరాజా మరియు యువన్ శంకర్ రాజా సంగీత దర్శకులు గా పని చేయడమే. ఒక చిత్రానికి సంగీత స్వరకర్తలుగా వారు పని చేయడం ఇదే మొదటిసారి.