టాలీవుడ్ స్టార్ యాక్టర్ అల్లు అర్జున్ తాజాగా పుష్ప 2 మూవీ ద్వారా ఆడియన్స్ ముందుకి వచ్చారు. ఈ మూవీలో రష్మిక మందన్న హీరోయిన్ గా నటించగా సుకుమార్ తెరకెక్కించారు. మొదటి నుండి అందరిలో మంచి అంచనాలు ఏర్పరిచిన ఈమూవీ మొత్తంగా బాక్సాఫీస్ వద్ద ప్రస్తుతం మంచి టాక్ తో కొనసాగుతోంది.
అయితే ఈ మూవీ యొక్క ప్రీమియర్ సందర్భంగా డిసెంబర్ 4న రాత్రి హైదరాబాద్ సంధ్య థియేటర్ కి ఫామిలీ తో కలిసి వెళ్లి మూవీ చూసారు అల్లు అర్జున్. దానితో ఒక్కసారిగా అక్కడికి విపరీతంగా జనం రావడం తొక్కిసలాట జరగడం జరిగింది. ఆ ఘటనతో రేవతి అనే యువతి మరణించగా ఆమె కుమారుడు తేజ పరిస్థితి విషంగా మారింది. కాగా ఆ విషయమై సంధ్య థియేటర్ యాజమాన్యంతో పాటు అల్లు అర్జున్ పై కూడా కేసు నమోదయింది.
కాగా ఆ దుర్ఘటనతో తమ పుష్ప 2 మూవీ టీమ్ మొత్తం ఎంతో బాధపడ్డాం అని, రేవతి కుటుంబానికి తక్షణం రూ. 25 లక్షలు సాయం అందిస్తున్నట్లు ప్రకటించారు అల్లు అర్జున్. విషయం ఏమిటంటే, కొద్దిసేపటి క్రితం ఆ కేసు విషయమై ఎంక్వరీ కోసం అల్లు అర్జున్ ని చిక్కడపల్లి పోలీస్ స్టేషన్ కు తీసుకెళ్లారు. అయితే అది ప్రత్యేకంగా అరెస్ట్ కాదని అంటున్నాయి ఆయన పిఆర్ టీమ్ వర్గాలు. ప్రస్తుతం ఈ న్యూస్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.