దగ్గుబాటి వెంకటేష్, రానా కలిసి నటించిన కొత్త వెబ్ సిరీస్ రానా నాయుడు నిన్న ఓటీటీలో విడుదలైన విషయం తెలిసిందే. ఐతే ఈ వెబ్ సిరీస్ కు ప్రేక్షకుల నుంచి వస్తున్న స్పందన అంతంత మాత్రంగానే ఉంది. కాగా ఇలాంటి కంటెంట్ ఉన్న సీరీస్ లో నటించినందుకు వెంకటేష్ పై ప్రేక్షకుల నుంచి తీవ్ర విమర్శలు వస్తున్నాయి. బహుశా తన కెరీర్ లో వెంకటేష్ చేసిన అతి పెద్ద తప్పు ఇదే అని కూడా కొందరు అంటున్నారు.
ఈ వెబ్ సిరీస్ లో కంటెంట్ పరంగా ప్రత్యేకత ఏమీ లేదని, నాసిరకం స్థాయిలో తీశారని నెటిజన్లు అంటున్నారు. అలాగే వెంకటేష్ నటనకు కూడా పెద్దగా స్కోప్ లేదని, ఆయన ఈ పాత్రను అంగీకరించడానికి కారణమేంటో తెలియటం లేదని వారు అభిప్రాయపడుతున్నారు.
ఈ తరహా అడల్ట్ కంటెంట్ ను వెంకటేష్ ప్రోత్సహిస్తారని ఎవరూ ఊహించకపోవడంతో వెంకటేష్ పై విమర్శలు చేస్తున్నారు. నిజానికి ఈ సమస్య బూతు డైలాగులు లేదా సెక్స్ సీన్స్ తో కాదు ఎందుకంటే ఓటీటీలో, ముఖ్యంగా నెట్ ఫ్లిక్స్ లో ఉండే ఇలాంటి ఎలిమెంట్స్ కు ప్రేక్షకులు అలవాటు పడ్డారు.
కానీ అదే సమయంలో రానా, వెంకటేష్ తొలిసారి కలిసి ఓ వెబ్ సిరీస్ లో నటిస్తున్నారని ప్రేక్షకులకు చెప్పగానే దాని పైన వారికి ఎన్నో అంచనాలు ఉండడం సహజమే. కానీ రానా నాయుడు క్రైమ్/సెక్స్/హింస మరియు బూతు పదాలతో కూడిన ఒక రొటీన్ హిందీ వెబ్ సిరీస్ లాగా ఉండటంతో ఆ అంచనాలను అందుకోలేకపోయింది.