Homeసినిమా వార్తలుఆరోగ్య సమస్యల వల్ల సినిమాలకు గ్యాప్ ఇచ్చిన సమంత

ఆరోగ్య సమస్యల వల్ల సినిమాలకు గ్యాప్ ఇచ్చిన సమంత

- Advertisement -

దక్షిణ భారత సినీ పరిశ్రమలలో అత్యంత ప్రతిభావంతులైన నటీమణులలో సమంత రుత్ ప్రభు ఒకరు. 12 ఏళ్ళ కెరీర్ లో నటిగా ఎన్నో అద్భుతమైన పాత్రలతో, సినిమాలతో ప్రేక్షకులను మెప్పించారు. కాగా గత సంవత్సరం విడుదలైన పుష్ప సినిమాలో ఊ అంటావా అనే పాటతో దేశాన్ని ఊపేసిన సంగతి తెలిసిందే.

అయితే గత కొంతకాలంగా సమంతా మీడియా, మరియు సోషల్ ఎంగేజ్‌మెంట్‌లకు దూరంగా ఉంటున్నారు. తన మాజీ భర్త నాగ చైతన్య నుండి విడాకులు తీసుకున్న కారణంగా సమంత తక్కువగా బయటకు వస్తున్నారని కొందరు భావించినప్పటికీ, తాజాగా తెలిసింది ఏంటంటే ఆమె కొన్ని ఆరోగ్య సమస్యలను ఎదుర్కొంటున్నారని, అందువల్ల ఆమె కొన్ని రోజులు అందరికీ దూరంగా ఉంటున్నారని సమాచారం.

విశ్వసనీయ వర్గాల నివేదికల ప్రకారం, సమంత గత కొన్ని నెలలుగా ఆరోగ్యం విషయంలో బాధ పడుతున్నారని, అందుకే ఆమె ప్రజల దృష్టికి దూరంగా ఉండాలని సూచించబడ్డారని తెలుస్తోంది.

ఈ కారణం వల్లే.. సమంత – విజయ్ దేవరకొండల ఖుషి సినిమా షూటింగ్ ఆగిపోయిందట, ఆరోగ్యం కుదుటపడేందుకు సమంతకు కొన్ని రోజుల సమయం అవసరం పడటం వల్ల, ఆమె నటిస్తున్న ఇతర సినిమాల షూటింగ్‌లు, పోస్ట్ ప్రొడక్షన్ పనులు కూడా ఆగిపోయాయి. ప్రస్తుతం సమంత కొన్ని చర్మవ్యాధులతో బాధపడుతున్నారని, అందుకు ఆమె అమెరికాలో చికిత్స చేయించుకొని, ఆ తర్వాత మళ్లీ షూటింగ్లకి హాజరు కానున్నారని ఇండస్ట్రీ వర్గాల వారు గట్టిగా చెబుతున్నారు.

సమంత ఇటీవలి కాలంలో సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్‌లకు కూడా దూరంగా ఉన్నారు. దాని వెనక కారణం తెలియక ఆమె అభిమానులు ఆందోళన చెందారు. సమంత చివరి ఇన్‌స్టాగ్రామ్ పోస్ట్ ఆమె ‘యశోద’ చిత్రం టీజర్ గురించి చేశారు. ఆ చిత్రంలో సమంత, తన మనుగడ కోసం మానసిక, శారీరక సంఘర్షణలను ఎదురుకునే గర్భిణీ స్త్రీ పాత్రను పోషిస్తున్నారు. ఇదిలా ఉండగా.. ఆయుష్మాన్ ఖురానా సరసన దినేష్ విజన్ తెరకెక్కిస్తున్న హర్రర్-కామెడీతో బాలీవుడ్‌లో సమంత అరంగేట్రం చేస్తున్నారు.

READ  కార్తికేయ-2 విజయం నిర్మాత నారాయణ దాస్ నారంగ్ గారికి అంకితం - అభిషేక్ అగ‌ర్వాల్

రాజస్థాన్‌కు చెందిన జానపద కథ ఆధారంగా తెరకెక్కుతున్న ఈ చిత్రంలో సమంత ఒక యువరాణి పాత్రను పోషించనున్నారు. రాబోయే రోజుల్లో సమంత మరిన్ని అద్భుతమైన సినిమాలతో ప్రేక్షకుల ముందుకి రానున్నారు. త్వరలోనే ఆమె పూర్తి ఆరోగ్యంతో తిరిగి వచ్చి తనదైన శైలిలో ప్రేక్షకులని అలరిస్తారని ఆశిద్దాం.

Follow on Google News Follow on Whatsapp


- Advertisement -
RELATED ARTICLES

Trending Stories

Recent Stories