Home సినిమా వార్తలు Harish Shankar made Damage for Mr Bachchan హరీష్ శంకర్ చేసిన అతే ‘మిస్టర్...

Harish Shankar made Damage for Mr Bachchan హరీష్ శంకర్ చేసిన అతే ‘మిస్టర్ బచ్చన్’ కి దెబ్బేసింది

vishwa prasad

మాస్ మహారాజా రవితేజ హీరోగా నూతన నటి భాగ్యశ్రీ బోర్సే హీరోయిన్ గా మాస్ కమర్షియల్ సినిమాల దర్శకుడు హరీష్ శంకర్ దర్శకత్వంలో తెరకెక్కిన లేటెస్ట్ యాక్షన్ మూవీ మిస్టర్ బచ్చన్. దీనిని గ్రాండ్ లెవెల్లో పీపుల్ మీడియా ఫాక్టర్ సంస్థ పై వివేక్ కూచిభొట్ల, టిజి విశ్వప్రసాద్ నిర్మించగా మిక్కీ జె మేయర్ సంగీతం అందించారు.

మొదటి నుండి అందరిలో మంచి అంచనాలు ఏర్పరిచిన ఈ మూవీ ఇటీవల ఆడియన్స్ ముందుకి వచ్చి భారీ డిజాస్టర్ గా నిలిచి బాక్సాఫీస్ వద్ద నిర్మాతలు, బయ్యర్లకు భారీ నష్టాలు తెచ్చిపెట్టింది. ఇక తాజాగా ఒక ఇంటర్వ్యూలో భాగంగా నిర్మాత విశ్వప్రసాద్ మాట్లాడుతూ, సినిమా మరీ అంతగా తీసేసేవిధంగా లేదని అన్నారు. ఫస్ట్ హాఫ్ బాగుందని, సెకండ్ హాఫ్ కొంత గాడి తప్పిందని అన్నారు. ముఖ్యంగా రిలీజ్ కి ముందు మీడియా వారికి దర్శకుడు హరీష్ శంకర్ ఇచ్చిన అతి ఇంటర్వ్యూస్ మరింత పెద్ద డ్యామేజీ చేశాయని అన్నారు. సినిమాలు హిట్స్ ఫ్లాప్స్ అనేవి వస్తుంటాయి పోతుంటాయి కానీ యాటిట్యూడ్ ముఖ్యం అన్నారు.

ఇక రిలీజ్ తరువాత మూవీ ఆకట్టుకోలేదు అని చెప్పకపోగా మరింత అతి చేసి పెట్టిన ఫ్యాన్స్ మీట్ లో హరీష్ చేసిన అతి, సినిమాకి భారీ మైనస్ అయిందన్నారు. కాగా తమ నుండి రాబోయే మిగతా సినిమాల మీద ఎంతో నమ్మకం ఉందని అన్న విశ్వప్రసాద్, ఇకపై మరింతగా ఆడియన్స్ ముందుకి మంచి సినిమాలు తీసుకువచ్చే ప్రయత్నం చేస్తాం అన్నారు.

Follow on Google News Follow on Whatsapp




Show comments
Exit mobile version