గబ్బర్ సింగ్ వంటి బ్లాక్ బస్టర్ తర్వాత పవన్ కళ్యాణ్ తో సినిమా చేయాలని దర్శకుడు హరీష్ శంకర్ తహతహలాడుతున్న సంగతి తెలిసిందే. వీరు ఇద్దరూ కలిసి పనిచేయడానికి పరస్పరం అంగీకరించారు మరియు మైత్రి మూవీ మేకర్స్ నిర్మాణంలో వారు చాలా కాలం క్రితం భవదీయుడు భగత్ సింగ్ అనే టైటిల్‌తో పోస్టర్‌ను కూడా విడుదల చేశారు.
అయితే హరీష్ శంకర్ చెప్పిన కథ పవన్ కళ్యాణ్ కి నచ్చలేదని సమాచారం. మొదట్లో ఈ లైన్ పవర్‌స్టార్‌కి బాగా నచ్చింది కానీ పూర్తిగా డెవలప్ అయిన తరువాత అది పవన్‌ని మెప్పించలేదట. ఇక ఈ స్క్రిప్ట్‌లో మార్పులు చేశారనే పుకార్లు చాలా వచ్చాయి.
సినిమా ఆలస్యం అవడంతో హరీష్ శంకర్ పవన్ కళ్యాణ్ వైఖరితో విసిగిపోయి మరో హీరో వైపు వెళ్లినట్లు కూడా కొన్ని వార్తలు వచ్చాయి. కానీ హరీష్ శంకర్ పవన్ కళ్యాణ్ కి వీరాభిమాని అని అందరికి తెలుసు కాబట్టి ఆయన గురించి చెడుగా మాట్లడటం వంటివి చెయరని, ప్రాజెక్ట్ సమయంలో కొన్ని సమస్యలు వచ్చినా సరే. ఓపికగా ఉంటారని మరో వర్గం వారు అంటున్నారు.
పైన చెప్పినట్లుగా స్క్రిప్ట్ పవన్ కళ్యాణ్‌కి నచ్చకపోవడంతో ఇప్పుడు దర్శక, నిర్మాతలు మరో స్క్రిప్ట్‌ని వెతకడంలో అయోమయంలో పడ్డారు. తాజా వార్త ఏమిటంటే స్క్రిప్ట్‌కు బదులుగా, దళపతి విజయ్ చిత్రం తేరిని రీమేక్ చేయడానికి మేకర్స్ ప్రయత్నిస్తున్నట్లు పుకార్లు వస్తున్నాయి. అంతర్గత వర్గాల సమాచారం ప్రకారం, మైత్రీ మూవీ మేకర్స్ వారి వద్ద ఇది వరకే ఆ చిత్రానికి సంబంధించిన రీమేక్ హక్కులు ఉన్నాయట.
అయితే ఈ వార్త గురించి ఇంకా అధికారిక ధృవీకరణ లేదు, కానీ హరీష్ శంకర్ రీమేక్‌లు బాగా తెరకెక్కిస్తారనే పేరు ఉంది. పవన్ కళ్యాణ్ తో అతని కెరీర్ బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ గబ్బర్ సింగ్ కూడా హిందీ హిట్ దబంగ్ కు రీమేక్. రీమేక్ అయినా సరే మాస్ మరియు అభిమానులకు ఉపయోగపడే అంశాలతో పాటు సమాజానికి మంచి సందేశం ఉండే సినిమాని ఎంచుకోవడం తెలివైన నిర్ణయమే అని కొందరు అంటున్నారు.
ఇన్ని పుకార్ల మధ్య.. పవన్ – హరీష్ కాంబోలో వచ్చే సినిమా ఫ్రెష్ స్క్రిప్ట్‌తో రూపొందుతుందా లేదా రీమేక్ అవుతుందా అనే దాని పై ఖచ్చితమైన సమాచారం రాలేదు. అన్ని ప్రశ్నలకు కాలమే సమాధానం చెబుతుంది. రీమేక్ అయినా స్ట్రెయిట్ సినిమా అయినా పవన్ – హరీష్ ల కాంబినేషన్ లో వచ్చే సినిమా భారీ విజయం సాధించాలని ఆశిద్దాం.