పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా నిధి అగర్వాల్ హీరోయిన్ గా ప్రముఖ దర్శకడు ఏ ఎం రత్నం దర్శకత్వంలో తెరకెక్కుతున్న లేటెస్ట్ భారీ హిస్టారికల్ యాక్షన్ డ్రామా మూవీ హరిహర వీరమల్లు పార్ట్ 1. ఈ మూవీలో వీరమల్లు అనే పవర్ఫుల్ పాత్రలో పవన్ కళ్యా నటిస్తుండగా ఇతర ముఖ్య పాత్రల్లో బాబీ డియోల్, నిధి అగర్వాల్, విక్రమజీత్ విర్క్, నోరా ఫతేహి, నర్గీస్ ఫక్రీ, జిషు సేన్‌గుప్తా
పూజిత పొన్నాడ నటిస్తున్నారు.
ఆస్కార్ సంగీత దర్శకుడు ఎం ఎం కీరవాణి సంగీతం అందిస్తున్న ఈ మూవీ యొక్క మిగిలిన భాగం షూటింగ్ ప్రస్తుతం వేగవంతంగా జరుగుతోంది. ఇక ఇటీవల హరిహర వీరమల్లు నుండి రిలీజ్ అయిన పోస్టర్స్, గ్లింప్స్ లు అందరినీ ఆకట్టుకుని మూవీ పై భారీ స్థాయిలో అంచనాలు ఏర్పరిచాయి.
కాగా ఈ పాన్ ఇండియన్ మూవీ యొక్క కొంత భాగాన్ని క్రిష్ జాగర్లమూడి తెరకెక్కించగా మిగిలిన భాగాన్ని ఏ ఎం రత్నం తనయుడు జ్యోతికృష్ణ తీస్తున్నారు. విషయం ఏమిటంటే ఈ మూవీ యొక్క ప్రమోషన్స్ ని రానున్న సంక్రాంతి నుండి స్టార్ట్ చేయనున్నారట. అక్కడి నుండి మూవీకి సంబంధించి వరుసగా ఒక్కొక్క అప్ డేట్ ని అందించి మార్చి 28న గ్రాండ్ గా తమ మూవీని థియేటర్స్ లోకి పక్కాగా తీసుకువచ్చేందుకు మేకర్స్ ప్లాన్ చేస్తున్నారట.