పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రస్తుతం రాజకీయాల పరంగా డిప్యూటీ సీఎం గా పలు భాద్యలతో ఎంతో బిజీగా కొనసాగుతున్నారు. మరోవైపు ఆయన పూర్తి చేయాల్సిన మూడు సినిమాలు ఇటీవల కొంత మేర షూటింగ్ జరుపుకుని మిగతా బ్యాలెన్స్ షూట్ కోసం సిద్ధం అవుతున్నాయి.
ఇక ఆయన నటిస్తున్న మూడు సినిమాల్లో క్రిష్, జ్యోతి కృష్ణ కలిసి తీస్తున్న హరి హర వీర మల్లు పార్ట్ 1 కూడా ఒకటి. ఈ మూవీని మెగా సూర్య ప్రొడక్షన్స్ బ్యానర్ పై ఏ ఎం రత్నం గ్రాండ్ లెవెల్లో నిర్మిస్తున్న ఈ మూవీ పై పవన్ ఫ్యాన్స్ తో పాటు నార్మల్ ఆడియన్స్ లో కూడా ఎన్నో అంచనాలు నెలకొని ఉన్నాయి. ఇక అక్టోబర్ 14న హరి హర వీర మల్లు నెక్స్ట్ షెడ్యూల్ జరుగకుంది.
ఈ షెడ్యూల్ లో పలు కీలక సన్నివేశాలు చిత్రీకరించేందుకు మేకర్స్ సిద్ధమవుతున్నారు. అయితే ఇంట్రెస్టింగ్ అప్ డేట్ ఏమిటంటే, ఈ మూవీ నుండి పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ స్వయంగా పాడిన ఫస్ట్ సాంగ్ ని అతి త్వరలో రిలీజ్ చేసేందుకు మేకర్స్ సన్నాహాలు చేస్తున్నారు. అలానే నవంబర్ 10 కల్లా చిత్రీకరణ మొత్తం పూర్తి చేయనున్నారు. ఇక హరి హర వీర మల్లు మూవీ 2025 ,మార్చి 28న గ్రాండ్ గా ఆడియన్స్ ముందుకి రానుంది.