పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా ప్రస్తుతం యువ దర్శకుడు జ్యోతి కృష్ణ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న హిస్టారికల్ యాక్షన్ అడ్వెంచర్ మూవీ హరిహర వీరమల్లు స్వార్డ్ వర్సెస్ స్పిరిట్. ఈ మూవీ యొక్క కొంత భాగాన్ని ప్రముఖ దర్శకుడు క్రిష్ జాగర్లమూడి తెరకెక్కించగా మిగతా భాగాన్ని జ్యోతి కృష్ణ తీస్తున్నారు.
ఇక ఈమూవీని మెగా సూర్య ప్రొడక్షన్స్ బ్యానర్ పై గ్రాండ్ లెవెల్లో ఏ ఎం రత్నం నిర్మిస్తుండగా హీరోయిన్ గా నిధి అగర్వాల్ నటిస్తున్నారు. బాలీవుడ్ నటులు బాబీ డియోల్, నోరా ఫతేహి, నర్గిస్ ఫక్రి తదితరులు కీలక పాత్రలు చేస్తున్నారు. ఆస్కార్ సంగీత దర్శకుడు ఎం ఎం కీరవాణి సంగీతం అందిస్తున్న ఈ మూవీ ఇప్పటికే చాలా వరకు షూటింగ్ జరుపుకోగా మిగతా భాగాన్ని ప్రస్తుతం చిత్రీకరిస్తున్నారు. ఇక ఈ మూవీని అన్ని కార్యక్రమాలు ముగించి 2025 మార్చి 28న గ్రాండ్ గా రిలీజ్ చేయనున్నాం అంటూ ఇటీవల మేకర్స్ డేట్ అనౌన్స్ చేసారు.
అయితే లేటెస్ట్ టాలీవడ్ బజ్ ప్రకారం ఈ మూవీ వాయిదా పడనున్నట్లు చెప్తున్నారు. దానికి కారణం ఓవైపు పవన్ తో సుజీత్ తీస్తున్న ఓజి మూవీ ఆల్మోస్ట్ షూటింగ్ మొత్తం పూర్తి చేసుకునే దశకు త్వరలో చేరుకోనున్నట్లు తెలుస్తోంది. కాగా ఓజి మూవీని అదే డేట్ న రిలీజ్ చేసేందుకు మేకర్స్ సన్నాహాలు చేస్తున్నారట. డివివి ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై దానయ్య ఈ మూవీని నిర్మిస్తున్నారు. అదే కనుక నిజం అయితే మార్చి ఎండింగ్ లో ఓజి మూవీ ఆడియన్స్ ముందుకి రావడం తథ్యం అంటున్నాయి సినీ వర్గాలు.