పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా ప్రస్తుతం తెరకెక్కుతున్న మూడు సినిమాల్లో హిస్టారికల్ యక్షన్ మూవీ హరిహర వీరుమల్లు కూడా ఒకటి. ఈ మూవీలో వీరమల్లు అనే గజదొంగ పాత్రలో పవన్ నటిస్తుండగా ఆయనకు జోడీగా యువ అందాల కథానాయిక నిధి అగర్వాల్ నటిస్తోంది.
ఈ మూవీని రెండు భాగాలుగా నిర్మిస్తుండగా మొదటి భాగం స్వార్డ్ వర్సెస్ స్పిరిట్ మూవీ మార్చి 28న గ్రాండ్ గా పలు భాషల ఆడియన్స్ ముందుకి రానుంది. కాగా ఈ భారీ పాన్ ఇండియన్ మూవీని మెగా సూర్య ప్రొడక్షన్స్ బ్యానర్ పై ఏ ఎం రత్నం నిర్మిస్తుండగా క్రిష్ జాగర్లమూడి, జ్యోతికృష్ణ కలిసి దీనిని తెరకెక్కిస్తున్నారు.
ఇక హరి హర వీర మల్లు నుండి ఇప్పటికే రిలీజ్ అయిన ఫస్ట్ సాంగ్ పర్వాలేదనిపించే రెస్సాన్స్ సొంతం చేసుకోగా తాజాగా మూవీ నుండి సెకండ్ సాంగ్ అప్ డేట్ అందించారు మేకర్స్. నేడు లవర్స్ డే సందర్భంగా తమ మూవీ నుండి కొల్లగొట్టినాదిరో అనే పల్లవితో సాగే సెకండ్ సాంగ్ ని ఫిబ్రవరి 24న మధ్యాహ్నం 3 గంటలకు రిలీజ్ చేయనున్నట్లు మేకర్స్ ఒక పోస్టర్ ద్వారా అనౌన్స్ చేసారు. బాబీ డియోల్, నర్గిస్ ఫక్రి, నోరా ఫతేహి, విక్రమ్ జిత్ విర్క్ తదితరులు ఇతర ముఖ్య పాత్రలు చేస్తున్న ఈ మూవీ కి ఆస్కార్ విజేత ఎం ఎం కీరవాణి సంగీతం అందిస్తున్నారు.