Homeసినిమా వార్తలునెగటివ్ షేర్స్ తో కొనసాగుతున్న 'హరి హర వీర మల్లు'

నెగటివ్ షేర్స్ తో కొనసాగుతున్న ‘హరి హర వీర మల్లు’

- Advertisement -

ప్రస్తుతం పవన్ కళ్యాణ్ హీరోగా నిధి అగర్వాల్ హీరోయిన్ గా తెరకెక్కిన హరిహర వీరమల్లు సినిమా జులై 24న గ్రాండ్ గా ఆడియన్స్ ముందుకు వచ్చిన విషయం తెలిసింది. ఈ పాన్ ఇండియన్ మూవీని మెగా సూర్య ప్రొడక్షన్స్ బ్యానర్ పై ఏఎం రత్నం నిర్మించగా క్రిష్ జాగర్లమూడి, జ్యోతి కృష్ణ కలిసి తెరకెక్కించారు.

అయితే మంచి అంచనాలతో ఆడియన్స్ ముందుకి వచ్చిన ఈ మూవీ ప్రీమియర్స్ నుండే పూర్తిగా నెగటివ్ టాక్ ని మూటగట్టుకుంది. ఫస్ట్ హాఫ్ బాగానే సాగిన ఈ మూవీ సెకండ్ హాఫ్ లో పూర్తిగా గాడి తప్పింది. దానితో పాటు ప్రధానంగా విజువల్ ఎఫెక్ట్స్ కూడా ఏమాత్రం బాగుండకపోవడంతో అందరి నుండి తీవ్ర విమర్శలు ఎదురయ్యాయి.

ఎం ఎం కీరవాణి అందించిన బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్, పవన్ కళ్యాణ్ యాక్టింగ్, రెండు సాంగ్స్ బాగున్నప్పటికీ కూడా ఓవరాల్ గా మూవీ బాక్సాఫీస్ వద్ద పూర్తిగా దారుణంగా కొనసాగుతోంది. మొదటి రోజు ప్రీమియర్స్ నుండి డే 1 వరకు బాగానే రాబట్టిన హరి హర వీర మల్లు మూవీ అక్కడి నుండి ఏమాత్రం బాక్సాఫీస్ వద్ద మంచి కలెక్షన్ రాబట్టలేదు.

READ  'హరి హర వీర మల్లు' : ఆ విషయమై ఇంకా సందిగ్ధమే

సోమవారం కేవలం రూ. 50 లక్షలు రాబట్టిన ఈ మూవీ నిన్నటి నుండి పూర్తిగా డెఫిషిట్స్ మరియు నెగటివ్ షేర్స్ తో కొనసాగుతోంది. ముఖ్యంగా ప్రధాన ప్రాంతాల్లోని మెయిన్ థియేటర్స్ లో కూడా ఘోరంగా నెగటివ్ షేర్స్ వస్తుండడం విస్తుపరిచే విషయం. మొత్తంగా అతి పెద్ద డిజాస్టర్ దిశగా కొనసాగుతున్న ఈ మూవీతో బయ్యర్స్ భారీ నష్టాలు చవిచూడాల్సిన పరిస్థితి ఎదురైంది.

Follow on Google News Follow on Whatsapp

READ  'హరి హర వీర మల్లు' ట్రైలర్ రిలీజ్ డేట్ ఫిక్స్


- Advertisement -
RELATED ARTICLES

Trending Stories

Recent Stories