పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా తాజాగా తెరకెక్కుతున్న మూడు సినిమాల్లో హిస్టారికల్ యాక్షన్ భారీ పాన్ ఇండియన్ మూవీ హరి హర వీర మల్లు కూడా ఒకటి. ఈ మూవీలో గజదొంగ వీరమల్లు అనే పవర్ఫుల్ పాత్రలో పవన్ కళ్యాణ్ నటిస్తుండగా అయనకు జోడీగా నిధి అగర్వాల్ గా నటిస్తున్నారు.
ఇప్పటికే చాలావరకు షూటింగ్ జరుపుకున్న ఈమూవీకి ఆస్కార్ విజేత ఎం ఎం కీరవాణి సంగీతం సమకూర్చగా మెగా సూర్య ప్రొడక్షన్స్ బ్యానర్ పై ఏఎం రత్నం గ్రాండ్ లెవెల్లో భారీ వ్యయంతో దీనిని నిర్మిస్తున్నారు. ఇటీవల హరి హర వీర మల్లు నుండి రిలీజ్ అయిన మూడు గ్లింప్స్ టీజర్ ఆకట్టుకోగా ఫస్ట్ సాంగ్ కేవలం పర్వాలేదనిపించింది.
అయితే తాజాగా రిలీజ్ అయిన కొల్లగొట్టినాదిరో సాంగ్ మాత్రం బాగానే రెస్పాన్స్ సొంతం చేసుకుంది. కాగా విషయం ఏమిటంటే, తమ మూవీని పక్కాగా మర్చి 28న రిలీజ్ చేస్తామని ఇటీవల కూడా నిర్మాత రత్నం మాట్లాడుతూ చెప్పారు.
అయితే తాజాగా అదే రోజున నితిన్ రాబిన్ హుడ్, అలానే నాగవంశీ నిర్మిస్తున్న మ్యాడ్ స్క్వేర్ సినిమాలు రెండూ కూడా రిలీజ్ డేట్ప్ ఫిక్స్ చేసుకున్నాయి. వాస్తవానికి మ్యాడ్ స్క్వేర్ మార్చి 29న రావాల్సి ఉండగా దానిని ఒకరోజు ముందే రిలీజ్ చేయనున్నట్లు కొద్దిసేపటి క్రితం టీమ్ అనౌన్స్ చేసింది. దీనిని బట్టి పక్కాగా హరి హర వీర మల్లు వాయిదా పడినట్లే అని తెలుస్తోంది. అయితే దీని సంబంధించి ఆ మూవీ టీమ్ నుండి అధికారిక అనౌన్స్ మెంట్ మాత్రం రావాల్సి ఉంది.